సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

18, ఆగస్టు 2018, శనివారం

' సన్నిధి ' భాస్కరన్నతో నేను .....

' సన్నిధి ' భాస్కరన్నతో నేను
---------------------------------
గలగలా సెలయేటి గండశిలల మీద
జలజలా పారు సలిలము వోలె
ముగ్ధ మోహన కృష్ణు మోవి మురళి వీడు
అతులిత మధుర సంగతుల వోలె
శ్రీగంధ పరిమళశ్రీలు మోసుక వచ్చి
కుతి దీర్చు మలయ మారుతము వోలె
కడగండ్ల పాలయి కనలు మనుజునికి
తగవైన సఖుని యోదార్పు  వోలె

పరమ భాగవతుడగు మా ' భాస్కరన్న '
అమృత ధారలు కురిపించు యమరగంగ ,
మృదుల స్రోతస్విని గతి , తనదు ప్రవచన
ధారలు కురియు , జనులు తాదాత్మ్య మొంద .

7 వ్యాఖ్యలు:

 1. అడిగానని ఏమనుకోకండి గానీ ఈ “భాస్కరన్న” గారి గురించి పరిచయం ఇవ్వగలరా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సార్ ,
   ధన్యవాదములు . వారిపేరు శ్రీ అల్లు భాస్కరరెడ్డి .
   క్రింద వివరించే ప్రయత్నం చేసేను .

   తొలగించు


 2. రాజన్నా! మరి భాస్క రన్న యెవరో ప్రాంగమ్ము లోతెల్పుడీ!
  సాజాత్యంబగుపించె మీరిరువురిన్ సామీప్యమున్గానగా
  తాజుబ్బయ్యిరి విన్న కోట వరులున్ తారీఫులన్ చూడగా
  మోజాయెన్ మరి మాకు కూడ కవిరాట్ మోదంబుగా జెప్పుడీ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్రీవెంకయ్యస్వామి భగవత్తత్త్వ పరిశోధనా సంస్థను స్తాపించి , స్వామి ఆశీస్సుధను
  లోకానికి పంచుతున్న మా ఆత్మీయ సఖుడు
  శ్రీ అల్లు . భాస్కరరెడ్డి

  పరమ భాగవతు డా గురు భరద్వాజ మా
  ష్టారుతో స్నేహ సంస్కారమొప్పు
  సాయితో వెంకయ్యస్వామితో సత్సంగ
  భక్తి సౌభాగ్యాల యుక్తి యొప్పు
  సాధనా పదయాత్ర సంజనిత జ్ఞాన
  బహు విథ సంపత్తి నియతి యొప్పు
  పరమాత్మశోధనావిరళ నిరతిశయ
  జీవనానంద సౌశీల్య మొప్పు - 4

  ఒప్పులకు కుప్ప , పలుకమృతోపమాన ,
  మెంతయో గొప్ప మనిషి , నిరంతర జప
  తప మనో జ్ఞాన భక్తి తత్త్వములనొప్పు
  అల్లు భాస్కరరెడ్డి మా ఆత్మ బంధు .

  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ధన్యవాదములు రాజారావు గారూ. సౌశీల్యుడైన వ్యక్తి అన్నమాట భాస్కరన్న గారు. వీరి పేరుకి ముందు “సన్నిధి” అని ఎలా వచ్చిందో కూడా వివరిస్తే బాగుంటుంది కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వారు స్థాపించి నిర్వహిస్తున్న సంస్థ పేరు ' సన్నిధి ' . ఈ సంస్థ ద్వారా సాయి - వెంకయ్యస్వామి
   భక్తుల సత్సంగాలూ , ఆ మహాత్ముల గూర్చిన శోధనలూ , అలాంటి
   తదితర మహానుభావులను గూర్చి స్వయంగా శోధించి రచించి పుస్తక
   రూపంలో ' సన్నిధి ' ద్వారా ప్రచురిస్తుంటారు .
   http//www.allubhasarredd/vedios.com అడ్రస్ ద్వారా
   youtube లో శోధించ వచ్చు .

   తొలగించు