సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, మే 2012, సోమవారం

తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు !

నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !

9 కామెంట్‌లు:

  1. రుచి చూసాము మాష్టారు. మీ పద్యరూపంలో.ఎంత బాగుందో!
    ధన్యవాదాలు మాష్టారు

    రిప్లయితొలగించండి
  2. పద్యాలు బాగున్నాయి.
    ’విబుధ విందులు’ మాత్రం మిశ్రమ సమాసం. బాగా లేదు. మార్చండి.

    రిప్లయితొలగించండి
  3. డా.ఆచార్య ఫణీంద్ర గారూ ,
    ధన్యవాదములు . సూచనకు కృతఙ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  4. Sir, తెలుగు పద్యమెంత తేనియరా... రుచి చూడరా అంటే బాగుండేదేమో కదా ఆలోచించండి , పద్యం చాలా గొప్పగా ఉంది

    రిప్లయితొలగించండి
  5. Sir, తెలుగు పద్యమెంత తేనియరా... రుచి చూడరా అంటే బాగుండేదేమో కదా ఆలోచించండి , పద్యం చాలా గొప్పగా ఉంది

    రిప్లయితొలగించండి
  6. శ్రీ మిరాజ్ ఫాతిమా గారు ! ప్రియము తోడ
    తెలుగు పద్యంపు తేనియ తియ్యదనము
    మీరు రుచి చూచి చెప్పిరి మేలు మేలు !
    ధన్యవాదములమ్మ ! సంతసము గల్గె .

    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  7. తేనెకన్న, పనస తొనలకన్న,
    మీగడ పాలకన్న, తీయనైనది...
    మన తెలుగు భాష...
    మనకే సొంతమైన పద్యం....
    చాలా బాగా చెప్పారు
    రాజారావు గారూ!
    మీకు అభినందనలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  8. తేనె కన్న తియ్యనైన తెలుగు పద్యాన్ని మన బ్లాగరుల మధ్య ఉంచాలనే ఉద్దేశ్యం తోనే కామెంట్లను పద్యాలలో వ్రాస్తున్నాను . మీ అభినందనలకు ధన్యవాదాలు శ్రీ గారూ !

    రిప్లయితొలగించండి