సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, మే 2012, మంగళవారం

విద్యాసదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత .....

                విద్యా సదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత గణనీయమైన ప్రాధాన్యత సంత రించు కొని ఉంది . జాతీయాదాయం లో అధిక శాతం విద్యా సదుపాయాల కోసంఖర్చు చేసే ప్రభుత్వాలు విజ్ఞ త గల ప్రభుత్వాలు .
                విద్యా వనరులు ఎక్కువగా ఉన్న దేశాల లోని ప్రజలు ఎక్కువ శాతం
విద్యా వంతులౌ తారు . విద్యా వంతులున్న సమాజం లోని ప్రజలు తమ సమస్య లకు
తామే చక్కని పరిష్కారాలు చూసుకో గల్గుతారు . అలాంటి దేశాలు అభి వృధ్ధి
పధంలో దూసుకు పోతాయి . ఆ దేశాల లోని ప్రభుత్వాలకు అవినీతి , ఆశ్రిత పక్ష
పాతం , లంచగొండితనాల మీద పోరాడ వలసిన అవసరం ఉండదు . అక్కడ ఉగ్రవాదం ,
వేర్పాటువాదం , హత్యలు , దోపిడీలు, అంటురోగాల వ్యాప్తి – అనే సమస్య
లుండవు . ప్రభుత్వాలు సజావుగా నడుస్తాయి . వ్యవసాయ , పారిశ్రామిక
ఉత్పత్తులు పెరుగు తాయి. జాతీయాదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తుంది .
ఇదంతా విద్యవల్ల ఏర్పడే బహుళ ప్రయోజనం .
               మరి ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు గుర్తిస్తున్నాయి ?
. " విద్యాశాఖ పద్దు క్రింద ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం . ఖర్చు తప్ప
ఈశాఖ లో ఆదాయం కంపించడం లేదు " – అని గతంలో ఒక మంత్రి మహోదయులు
సెలవిచ్చారంటే మన ప్రభుత్వాలను నడిపే ప్రబుధ్ధులు ఎంతటి విద్యాసక్తి
గలవారో , వారిలోగల ప్రజాసేవాభావం ఏపాటిదో , ఎంత తల్లకిందులుగా
కార్యమగ్నమై ఉందో కీర్తించ వలసిందే .
               దేశ ప్రజలంతా విద్యా వంతులైతే డబ్బు తీసుకొని ఓటెయ్యరు
కదా ! సారా పొట్లాలనూ , బిర్యానీ పొట్లాలనూ దరి దాపుల్లోకి రానియ్యరు కదా !
. విద్యా వంతు లైన ప్రజల పై ప్రలోభాలు పనిచెయ్యవు . వారికేమి కావాలో చేయ
గల్గినప్రభుత్వాలనే నిక్కచ్చిగా ఎన్నుకొంటారు . రౌడీ రాజ కీయాలకూ , గూండా
ప్రభుత్వాలకూ చెల్లు చీటీ పడుతుంది మరి .
              నూటికినూరుశాతం విద్యా వంత మైన సమాజం ఏర్పడడానికి ప్రభుత్వ పరంగా
ఏమేమి చేయాలి ?
              కనీసం ఇంటర్ మీడియట్ స్థాయి వరకు ఒకే ఒక ప్రభుత్వ సెక్టార్ లోనే
విద్యాలయాలు నిర్వహింప బడాలి . విద్యాలయాలు రెసిడెన్షియల్ విధానంలో సకల
సదుపాయాలు కల్గిన " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులు " గా తీర్చి దిద్ద బడాలి .
              అంటే పిల్లవాడు నర్సరీ లో " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులో
"అడుగుపెడితే ఇక ఇంటితో , తల్లి దండ్రు ల తో సంబంధం లేకుండా – అక్కడే
పెరిగి పెద్దవాడై విద్యాబుధ్ధులతో ఇంటర్ పూర్తిచేసుకొని మంచి మూర్తిమత్వం
రూపుదిద్దుకొనిప్రయోజకుడైబయటిప్రపంచములోకిరావాలి.                                                                                                                                                                  దీనికోసం తల్లిదండ్రులనుండి ఒక్కరూపాయి కూడా వసూలుచేయరాదు . పేద ధనిక తేడాలుందరాదు .
               పెద్ద పంచాయితీ లైతే ఒకటి , చిన్న పంచాయితీలు రెండు మూడింటికి కలిపి
ఒకటి చొప్పున – జనాభా ప్రాతి పదికన – ఏర్పాటుచేయ వచ్చు .                                                 ఖర్చువిషయానికి వస్తే విద్యా శాఖలో ఒక్కో ఊళ్లో – మెయిన్ స్కూలు, హెచ్ సి, జి
సి, నాన్ ఫార్మల్, హైస్కూలు, ఆర్ బీ సీ, ఎయిడెడ్, ఇంకా ఇంకా అనేకానేక
దండుగ మారి దుకాణాలన్నీమూసేసి ఆనిధులను విని యోగించవచ్చు .
              సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ మొదలైన అవినీతిమయ హాస్టల్ల అవసరం ఉండదు .
ఇప్పుడు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాలయాల అవసరంలేదు ,
              విద్యా శాఖ నంతా ఒక కొలిక్కితెచ్చి ప్రభుత్వాలు పిల్లల నందర్నీ దత్తత
తీసుకొని ఇంటర్ వరకూ చదివించే బాధ్యత తీసుకొంటే – అటు తర్వాత ఏర్పడ బోయే
సమాజాన్ని ఊహించుకొంటే ఎంత ఆనందం కల్గుతుందో గదా !

4 వ్యాఖ్యలు:

  1. మాష్టారు, నిజంగానే మీ అలోచనలన్నిటికీ రూపం వస్తే వాటిని ఆచరిస్తే నవ సమాజ నిర్మాణం తప్పక జరుగుతుంది.కాని ముందుగా రాజకీయ నాయకులకు కూడా minimum educational qualifications ఉండాలి అని నా అభిప్రాయం.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే లోపమే యిది . ఈ వ్యవస్థే నాయకులకు దోచుకుతినే అవకాశాన్నిస్తోంది . అందరూ దోపిడీ దారులే . అధికారంలో ఉండే వాళ్లను వ్యతిరేకించిన వాళ్లకుమా త్రమే జైళ్ళు .వ్యతిరేకించిన వాళ్లు సపోర్ట్ చేసిన మరు క్షణం శిక్షలెటు పోతాయో మరి , పదవులిచ్చేస్తున్నారు . ఏనాయకుడూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలలోకి రావడంలేదు అనేది నాయకులకూ తెలుసు . ప్రజలకూ తెలుసు . నాయకులూ అవినీతి పరులే . ప్రజలూ అవినీతి పరులే . అలాంటప్పుడు ఈ దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థే అవసరం లేదు . చదువుకున్నా , చదువుకోక పోయినా నాయకుల ధ్యేయం అధికారం , దోపిడీ . ప్రజాసేవ ఎంతమాత్రం కాదు . చక్కగా స్పందించిన జలతారు వెన్నెల గారికి ధన్యవాదాలు .

    ప్రత్యుత్తరంతొలగించు
  3. SIR పొంగేదంతా కుంగే కొరకే అన్నారు పెద్దలు , కనుక విద్యా విలువలు తెలుసుకునే రోజు వస్తుంది , మీ పోస్ట్ అర్ధవంతంగా ఉంది

    ప్రత్యుత్తరంతొలగించు