సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, ఆగస్టు 2012, గురువారం

" కృష్ణం వందే జగద్గురుం "


కృష్ణుణ్ణి తలుస్తేనే –

జగత్తంతా ఆడతనం పరచు కొంటుంది .

మథుర భక్తి మనోఙ్ఞమై విరుచు కుంటుంది .

జగన్నాధుని ఆరాధనతో మనోనేత్రం తెరుచు కుంటుంది .కృష్ణుని పేరు వింటేనే –

జగత్తుకు భగవద్గీత విన్పిస్తుంది .

అధర్మంపై ధర్మ పోరాటం మొదలౌతుంది .

ఆర్తులకు జగన్నాధుని ఆశ్రయం లభిస్తుంది .కృష్ణుని రూప లావణ్యం చూస్తేనే –

జగత్తులోని అందమంతా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది .

ఆత్మకు అనిర్వచనీయమైన ఆనందం కల్గుతుంది .

జన్మాంతర దు:ఖాలకు విముక్తి లభిస్తుంది .మోవి తాకిన క్రోవి   మోహనరాగ మాలపిస్తుంటే

ప్రకృతి యావత్తూ సమ్మోహిత మైన ఈ వేళ

బృందావన విహారిని స్మరించు కొందాం .మహాత్ముల సంస్మరణ

మానవ జీవితాలకు

మార్గ దర్శనం చేస్తుంది .జగన్నాధుని  కని పెంచిన దేవకీ-వసుదేవులనూ , యశోదా-నందులనూ –

కృష్ణ ద్వైపాయణుణ్ణీ , కృష్ణనూ , కృష్ణ సచివుణ్ణీ –

రాధ , రుక్మిణి , మీరా , జయదేవుడు , వామదేవుడు , క్షేత్రయ్య మొదలైన భక్త శిఖా మణులనూ –

కృష్ణుణ్ణి తెలుగు వాకిటికి తెచ్చి , ప్రతిష్ఠించిన పోతన్ననూ

కన్నయ్యతో పాటు జన్మాష్టమి రోజున

స్మరించు కుందాం .

కృష్ణం వందే జగద్గురుం

14 వ్యాఖ్యలు:

 1. అవును రాజారావు గారూ!
  మీరన్నవి నిజమే...
  ఆ నందనందనుని కీర్తించడం పావన కార్యం...
  మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాభినందనలు...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చక్కగా చెప్పారండి.
  వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం
  దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం //
  శ్రీకృష్ణాష్టమి శుభాకంక్షలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా చక్కగా చెప్పారండీ... చాలా బాగుంది..

  శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు....

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కృష్ణుని తలిస్తేనే ....అంటూ ఎంత బాగా చెప్పారండీ ...ఆయన చాలు మనకి..!!ఆ కన్నయ్య కటాక్షవీక్షణాలు మీపై ఉండాలని ఆశిస్తూ...
  శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రీనివాస్ గారూ ,
  నేటి మీ టపా రాధా మాధవుల ప్రణయ శృంగార కావ్యం .మనసు ఆనందంతో పరవసించింది .
  మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు .
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. భారతిగారూ ,
  ఆ జగన్నాధుడే జగద్గరుడు .గీతాచార్యుడు .
  జన్మాష్టమి శుభాకాంక్ష లు మీకు .
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శ్రీలలిత గారూ ,
  సుజన-సృజన మీకు స్వాగతం పలుకుతోంది .
  జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు .
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 9. సీత గారూ ,
  కన్నయ్య ఊహలతో మనసు పరవశిస్తుంది .
  ఎంత కీర్తించినా తనివి తీరదు .
  ఆ కృష్ణుడికీ మీకూ అవినాభావం కదా ,
  జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు .
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 10. సాయి గారూ ,
  కృష్ణుని సంస్మరణం మహద్భాగ్యం .
  జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు .
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. సర్, మీ కలం నుండి ఏదైనా అద్భుతంగా వికసిస్తుంది.
  కాని తక్కువ రాస్తారు ఎందుకో.సర్, నేను పూజించే అక్షరాలూ మీ కాలంలో (గురువుగారి ) కొత్త రూపం పొందుతాయి .
  ధన్యవాదాలతో .. మెరాజ్

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కలం అని సరిచేసికోవలసినదిగా ప్రార్దన

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఫాతిమా జీ ,
  మీ అభిమానానికీ , తెలుగు భాషపై అద్భుతమైన మమకారానికీ , మహోన్నత సహృదయతా సంస్కారానికీ ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 14. సర్, కృతజ్ఞతలతో మరో మారు నమస్కరిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు