సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, సెప్టెంబర్ 2012, శనివారం

తెలుగులో మాటాడు .....


తెలుగులో మాటాడు

తెలుగు లోనె మాటాడు

తెలుగు వాళ్ళందరితో

తెలుగు తెలిసిన వారందరితో

తెలుగు లోనె మాటాడు               // తెలుగులో //

 

ముగ్థ మోహన రూపు

మురిపాల తెలుగు లిపి

ముత్యాల సిరి పేర్చు

ముగ్గులను తలపించు                 // తెలుగులో //

 

మురళీ రవం లాంటి

మోహన గానాలు పల్కు

 శబ్ద జాల మొలికించే

 సంగీతపు సరిగమ సిరి                  // తెలుగులో //

 

దిగంతాల నజంతాల

పద సంపద పొదువు కొన్న

నుడి కారపు సొంపులు గల

మడి మాన్యపు టక్షరాల                // తెలుగులో //

 

తెలుగు తోట పూ మొక్కకు

సంస్కృత లత లంటు గట్టి

తెలుగు దనపు నీరు పెట్టి

తెలుగు పూలు పూయించిన            // తెలుగులో //

 

మాతృ భాష మమకారం

మంచి నీటి చెలిమ పథం

పర భాషల వ్యామోహం

ఎండ మావి  చెలిమి విథం            // తెలుగులో //

12 కామెంట్‌లు:

  1. తెలుగు భాషలో మాధుర్యాన్ని, 'తెలుగు'దనంలో అందాన్ని బహు చక్కగా అభివర్ణించారు. అభినందనలు మాస్టారుగారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారతి గారూ ,
      నిజమే .తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూచి బ్రౌణ్ వంటి గొప్ప గొప్ప పండితులే మెచ్చుకొన్నారు .
      ధన్యవాదాలు .

      తొలగించండి
  2. తేనే కన్న తీయనిది...
    వెన్న కన్న కమ్మనిది...
    పనస కంటే మధురమైనది...
    తెలుగు తీపి ముందు అన్ని దిగదుడుపే...
    దేశ భాషలందు తెలుగు లెస్స...
    రాజా రావు గారూ!
    తెలుగు భాషకు శ్వాసలు మీ వ్రాతలు...
    అభినందనలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారూ ,
      కృష్ణ రాయని మాట అక్షరాలా నిజం .
      మథుర కవితలు రాస్తున్న మీ తెలుగులో తీపిని మేం మరువగలమా ?
      ధన్యవాదాలు .

      తొలగించండి
  3. తెలుగులోని తీయదనం
    మీ కవితలో కన్నాం!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మార్పిత గారూ ,
      తెలుగు పదాలు మీ చేతిలో పడి హుషారైన భావ చిత్రాలు
      గా రూపు దిద్దు కుంటున్నాయి .
      ధన్యవాదాలు .

      తొలగించండి
  4. సర్, నా భావ జా(జ)లాన్ని శంఖంలో పోసి తెలుగు తీర్ధంగా మార్చనా..
    నా కవితకు తెలుగు తీపి అద్దనా..
    నా గేయానికి తెలుగు గంధం పూయనా..
    నా మాటను తెలుగు తేటలో కడగనా..
    నా పలుకును తెలుగు వెలుగుతో నింపనా ..
    నా దస్తూరికి అచ్చతెలుగు ఆపాదించనా ...
    నా రాతల స్వచ్చతకై మీరు ఇచ్చిన సందేశాలను ఉక్త లేఖనం రాయనా.. .... మెరాజ్

    రిప్లయితొలగించండి
  5. మెరాజ్ గారూ ,
    ఆహా !ఎంత కమ్మనైన తెలుగు మాటలు !
    మీ కవితా శంఖంలోని తెలుగు తీర్థాన్ని , అందులోని తియ్యందనాన్ని,
    మీ కవితా సుమాల సుగంధాన్ని ,
    మీ కవితా భావనలోని తేటదనాన్ని,
    మీ కవితావేశంలోని వెలుగుల తీవ్రతనూ -
    చదివి , ఆస్వాదిస్తూనే ఉన్నాం .
    ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  6. సర్, గురుపూజోత్సవ మొదటి వందనం మీకు సమర్పించుకుంటున్నాను, నా శిష్యులకు నేను న్యాయం చేయగలిగేల దీవించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫాతిమాజీ ,
      భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు .
      వృత్తి ధర్మాన్ని పాటించే మీరు ఉన్నతిని పొందుతారు .
      గురుపూజోత్సవ శుభాకాంక్షలు మీకు .

      తొలగించండి

  7. మాస్టారు,మంచి సందేశం తో రాసిన పద్యం. చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి