సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

27, సెప్టెంబర్ 2018, గురువారం

బాదరాయణ సంబంధం -- కథ -- కమామిషు

కోరి ప్రేమించి పెండ్లాడి క్రొత్త జంట
పురము వీడ్వడి వేరు కాపురము బెట్టె
నంతలో చుక్కతెగి పడ్డ యట్లు దిగిరి
బండి గట్టుక వచ్చిన బంధు జనులు

వరుని వైపున వారని వధువు తలచె
వధువు వైపున వారని వరుడు తలచె
వస్తు చయముల సమకూర్చ వరుని వంతు
వండి వార్చంగ వడ్డించ వనిత వంతు

ఇష్ట మైనట్టి వన్ని వండించు కొనుచు
తినుచు త్రాగుచు బంధువుల్ దిరుగు చుండ
తీరికే లేదు పాపము తినగ ద్రావ
కూడి తలపోయ నింకేడ? క్రొత్త జంట

తిష్ట వేసిన బంధుల తీరు జూచి
చేరి తమలోన జంట చర్చించు కొనగ
తమకు వారికి నెట్టి బంధమ్ము లేమి
యెరిగి యడిగిరి , వారు జంకేమి లేక

‘ అయ్యొ! మా బండి చక్రాల కొయ్య గాని
అట్టె మీయింటి ముందున్న చెట్టు గాని
బదరికా వృక్ష సంబంధ మగుట, మనము
బాదరాయణ సంబంధ బంధువులము ‘

అనిరి, నివ్వెర పోయిరి వినిన జంట ,
పరగ నేబంధములు లేని బంధమునకు
చేరి యీమాట భూమి ప్రసిధ్ది గాంచె
బాదరాయణ సంబంధ బంధ మనుట
(బదరికా వృక్షము = రేగు చెట్టు)

------వెంకట రాజారావు .లక్కాకుల

19 వ్యాఖ్యలు:

 1. బాగుంది గురువు గారు.
  ఇన్నాళ్లూ ఈ పదం వినడమే గానీ దాని నిజ తాత్పర్యమిదన్న అవగాహన లేదు.
  మీ పుణ్యాన ఇప్పుడు బుర్రన నిక్షిప్తమైంది. కృతజ్ఞతలు. __/\__ ...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మనకు పేరైనా తేలని బాదరాయణ సంబంధాలు చాలానే ఉన్నాయిగా ,
   అవన్నీ బాదరాయణ సంబంధాలే నని చెప్పడానికే ఈ ప్రయత్న మన్నమాట .
   ధన్యవాదములు .

   తొలగించు
  2. // “ మనకు పేరైనా తేలని బాదరాయణ సంబంధాలు చాలానే ఉన్నాయిగా ,” //
   ————
   హ్హ హ్హ హ్హ, చివరికి ‘అక్కడికి’ లింక్ పెట్టారన్నమాట మాస్టారు 😀. ఎంతైనా కవుల చతురతే వేరండి 👌..

   తొలగించు
  3. వినకండీ ....రావు గారూ ...మాట ...మాట !

   తొలగించు
  4. విన్నకోటవారూ ,
   ఇంకా లింకు లెక్కడున్నాయండీ ,
   అన్నీ రేగు చెట్టు సంబంధాలేగా .

   తొలగించు


  5. పూర్వాశ్రమంలో బీరకాయపీచు సంబంధం‌ అయ్యుంటుంది‌ :)


   జిలేబి

   తొలగించు

 2. వచ్చె వచ్చె !

  రేగిపండ్ల వడ యెక్కడ ?

  బాగా మిర్చి పెట్టి చేస్తే జుజుబీ యుమ్మీ గా నోరూరిస్తూ వుంటుంది :)  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ జిలేబీ పేరు తీసేసి జుజుబీ పేరు తగిలించేసుకోండి .
   ఇంకా యెమ్మీగా ఉంటుంది . పిలవమంటారా అలాగా ...

   తొలగించు


  2. జుజుబీ యనెట్టుకొనుడ
   మ్మ జిలేబీ యన్న పేరు మార్చి నెలతుకా
   బిజిలీ నే పేరున బి
   ల్వ జిగిష మారునకొ రాజ లక్కాకులయా!


   జిలేబి

   తొలగించు
  3. ఒక్కమారన పక్కా వంద మార్లేయని ఎంచక్కా నొక్కి వక్కాణించు చుక్క, రజనీ తురుపు
   ముక్క జుజుబీ యొక్క సవివరపు లెక్క నెఱుంగక, చొక్కిడి, గురు లక్కాకుల వారు
   గ్రక్కున నెలతుక అయ్యరు జిలేబీ తక్కెట జిక్కి ఉక్కిరిబిక్కిరై పక్కకు బో(లే)క ఠక్కున
   మక్కువగ ఓ చక్కని లెక్కకొచ్చి ఈ చక్కని జుజుబీ నామమునె నిక్కము గావించెనహో !

   ప్రియ జుజుబీ బామ్మకు నూతన నామకరణ శుభాకాంక్షలతో ...

   తొలగించు
  4. వారి మాటల లోదే యైనా ఇదేదే బాగుందని నేను ప్రపోజ్ చేస్తే బండివారు
   బలపరచి ఖాయంచేశారన్నమాట . తథాస్తు . ఐనా ,
   జుజుబీ అంటే కందిరీగల తుట్టె అని అర్థమట !

   తొలగించు
  5. మరప్పడు మా బామ్మకు జుజుబీ యే సరియైన
   నామధేయం గా నప్పును గదా గురువు గారు.
   జుజుబీ ... :)
   (కుట్టునో ఏమో !)

   తొలగించు


 3. నామంబిడిరట జుజుబీ!
  శ్రీమాన్బండివరులు సయి చెల్లు సుమీ యీ
  నామము బామ్మకనిరట! త్సు
  నామీలకరె మరియొక త్సునామియకో హా:)

  జుజుబీ
  జిలేబి
  త్సునామి
  కందిరీగలతుట్ట ,
  కంది "రీగల్" తుట్ట :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మాస్టారూ, ఇది కాస్త పెద్ద వ్యాఖ్య. మీ బ్లాగ్ వాడుకుంటుంన్నందుకు ఏమీ అనుకోరని ఆశిస్తాను.
  ------------
  "పెళ్ళికాని" ప్రదీప్ అని ఒక తెలుగు టీవీ ఛానెల్ యాంకరుడి కోసం "పెళ్ళిచూపులు" అని ఒక టీవీ షో నడుపుతున్నారు సుమ అనే ఒక యాంకరిణి. పరమ జుగుప్సాకరంగా ఉంది అనుకున్నాను ఒక విడత (episode) చూడగానే (తరువాత ఆ జోలికి పోలేదు). నాలాగానే అభిప్రాయపడుతున్న వారు మరి కొంతమంది ఉన్నారని ఈ వాట్సప్ మెసేజ్ (forward) 👇 చూసి కాస్త ఆనందించాను.
  వినోదరంగం వారు సమాజాన్ని ఎటు నడిపిస్తున్నారో అనే దిగులు కలుగుతుంటుంది. మేరా భారత్ మహాన్ 🙏.

  ====================
  ప్రదీప్ పెళ్లిచూపులు..

  ఎక్కడికి పోతున్నామో మనం అర్ధం కావడంలేదు..ఏంటీ అర్ధం పర్థం లేని టీవీ షోస్..? జనాల్ని వెర్రివాళ్లను చెయ్యడం కాకపోతే.. డేటింగ్ మన సంస్కృతి కాదు కదా..ఒకడేవడో స్వయంవరం ప్రకటిస్తే ..పోలోమంటూ ఆడపిల్లలు క్యూ కట్టడమా..? ఎంత సెలిబ్రిటీ, పేరున్న యాంకర్ అయినా.. అమ్మాయిలు వచ్చి మీద పడిపోవడమా..? ఐ లవ్ యూ..
  ఎంత ముద్దు వస్తున్నావో..
  నీ సొట్టబుగ్గల ఎంత బావున్నాయో..
  నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది..
  ఛీ.. అసలు తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో? అతను అందర్నీ పెళ్లి చేసుకోడుగా..ఎవరినో ఒక్కరినే వరిస్తాడు.. మిగిలినవాళ్ళు ఇక్కడ వేసే వెకిలి వేషాలకు పెళ్లిళ్లు అవుతాయా..? ఎంత గారాబంగా పెంచినా ,అమ్మాయిలు ఏదంటే అదేనా..? వద్దు అని వారించరా? గిఫ్ట్లు ఇవ్వడం, హగ్స్..తెలుగు ఛానళ్లు దరిద్రాన్ని తెచ్చి మన డ్రాయింగ్ రూముల్లో డంప్ చేస్తున్నాయి.
  ఒక మగవాడి కోసం అంత వేలంవెర్రి వేషాలు వేస్తారా..? టీవీల్లో కనపడాలనే కోరికతోనా..నిజంగా ప్రదీప్ కి అంత సీన్ ఉందా అసలు ? వేరే దేశాల నుండి, తెలుగు రాకపోయినా అతని కోసం నేర్చుకుని మరీ వచ్చామని చెప్పడం..ఇదంతా డ్రామానా..అమ్మాయిలకి ప్రదీప్ అంటే అంత క్రేజ్ ఉందా..?
  నాకు నమ్మబుద్ధి కావడంలేదు. ఈ చెత్త డ్రామాకి తల్లిదండ్రుల సపోర్ట్..
  తమ కూతుళ్ళ వల్ల తాముకూడా సెలిబ్రిటీలు అవుతాము అనుకుంటున్నారేమో..?
  ఈ మధ్య ఆడపిల్లల తల్లిదండ్రుల ప్రవర్తన చాలా వియర్డ్ గా ఉంటోంది..ఎంత బాగా చదువుకొని, మంచి కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి సంబంధం అయినా..ఎదో వంక పెట్టడమే.. పాకేజీ ఎంత ? ఓన్ హౌస్ ఉందా..హైట్ 6 ఫీట్ ఉన్నాడా, అత్త,ఆడపడుచులు ఉన్నారా.. అంటూ ఎంత ఆరా తీస్తున్నారో..తమకూతురు బీటెక్ మాత్రమే చదివినా, అబ్బాయి మంచి కాలేజీల్లో పీజీ చేసి..పెద్ద పాకేజీ ఉన్న, మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చెయ్యాలి. అదికూడా తమ కూతురు యెస్ అంటేనే.. మొన్న నేను తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఒక మంచి మ్యాచ్ చెప్పా..ఒక్కడే అబ్బాయి, MS చేసి,పెద్ద కంపెనీలో మంచి పాకేజీ, 4 ఇళ్లు..ఒక కొత్త ఫ్లాట్, అబ్బాయి చాలా బావున్నాడు.. అమ్మాయి అనుకున్న దానికన్నా 1' హైట్ తక్కువ..తనకి 6 అడుగులు కావాలట, అబ్బాయి 5'11ఉన్నాడు..నచ్చలేదు అని చెప్పారు.

  మరి ప్రదీప్ మాచిరాజు కు ఏమి ఉన్నాయి ? డ్రంక్ న్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు..అంటే తాగుతాడు..పొట్టి..వెకిలి యాంకరింగ్..ఏమి చూసి అమ్మాయిలు ఎగబడుతున్నారు ? తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు ?
  నాకు పరమ చిరాకు, అసహ్యం వేస్తోంది ..పైగా వీళ్ళందరికీ IQ టెస్టులు..ఇంతోటి రాజకుమారుడు దొరకడని..ఈ ఆడంగులు పోటీ పడటం..మంచి కుటుంబంలో పుట్టి, చదువుకుని ,ఉద్యోగం చేసే అబ్బాయిలు వద్దు..
  ఇలా ఉదయం నుండి మళ్లీ తెల్లారే వరకు స్టూడియోల్లో ఉండే 'యాంకరు' కావాలి..
  అల్ ద బెస్ట్ అమ్మాయిలూ..
  మీ అమ్మా నాన్నలకి కూడా..

  అన్నట్టు కొసమెరుపు ఏమిటంటే హిందీలో వచ్చిన షోలలో ఇలాంటి పెళ్లిచూపులు ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్లంతా విడాకులు కూడా తీసుకున్నారు..

  💐శుభం భూయత్!!💐

  Forwarded message👆
  =====================

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పెళ్ళిచూపులు "రాఖీ కా స్వయంవర్" లాంటి గేం షో కదా ? రాఖీ పెళ్ళిచేసుకోలేదు.ఇటువంటివి నిజమని నమ్మేవాళ్ళని ఏమనుకోవాలి ?
   పెళ్ళిచూపులు లో వచ్చినవాళ్ళంతా అమ్మాయిలు కారు నాలాగే ఆంటీలు !

   తొలగించు
  2. ది బెస్ట్ ఆన్సర్ ,
   ప్రైజ్ మనీ గోస్ టు నీహారికా .

   తొలగించు