సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, డిసెంబర్ 2018, సోమవారం

మిత్రులకు క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు

శ్రీరస్తు శుభమస్తు శ్రీచిద్విలాసినీ
కొంగ్రొత్త వర్ష ! రా ! కొలువు దీరు ,
పుడమికి నగణిత భోగ భాగ్యాలిచ్చు
కాల చక్రమ ! మమ్ము గావ రమ్ము ,
 క్రమగత విహిత సక్రమ మహితర్తు కా
ల విలసన ప్రభా లలిత  !  రమ్ము ,
శోభన ప్రకృతీయ శుభ ప్రశాంతత లివ్వ
రావమ్మ నవ్యాబ్ది ! రమ్య గతుల ,

వచ్చి భూమి పయి సుభిక్ష మిచ్చి , సకల
ప్రాణి కోటి మనుగడకు భయరహిత మ
నోఙ్ఞ జీవన దాతవై నూత్న వెలుగు
రేఖలు గురియుము విభావరివయి తల్లి !

8 వ్యాఖ్యలు:

 1. మీకున్నూ నూతన వర్ష శుభాకాంక్షలు గురువర్యా ...
  _/\_ ...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు నాగమల్లీశ్వర రావుగారూ ,
   మీకూ , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

   తొలగించు
 2. నూతన సంవత్సర శుభాకాంక్షలు మాస్టారు గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నూతన సంవత్సర శుభకామనలు, మాష్టారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. లలిత గారూ ,
  మీకూ , మీ కుటుంబానికీ కూడా నూతనసంవత్సర
  శుభాకాంక్షలండీ .
  ధన్యవాదములు కూడాను .

  ప్రత్యుత్తరంతొలగించు