సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, అక్టోబర్ 2018, మంగళవారం

ఆరోగ్యంగా బ్రతుకుదాం ..... ఆనందంగా జీవిద్దాం




తల్లి దండ్రి మనోల్లాస తన్మయత్వ

తాత్వికత నుండి జన్మించి ధరణి బడిన

“ మనిషి   తన ప్రమేయమె లేక జనన మాది

తెచ్చుకొన్న లక్షణముల  దిరుగు చుండు



తర తరాల నాటివి , తల్లి-దండ్రి ద్వార

రూపు , లలవాట్లు , బుధ్ధులు , రోగములును

సర్వము క్రమాను గతముగా సంక్రమించి

మనుట “ విధిరాత , ప్రారబ్ధ “ మనిరి , యైన -



పెండ్లియై నీవు నీభార్య ప్రేమ మీర

బిడ్డలను గని “  ఇవి   సంక్రమింప జేయ

న్యాయమా ?  సర్వ శుభ లక్షణాన్వితులుగ

పుట్టి జీవింప జేయగా బోలు గాని  



తర తరాల నుండి తరలి , దరికి జేరి

మిమ్ము బాధించు “ అట్టి దైన్యమ్ము  మార్చి ,

మిమ్ములను మీరు తీర్చి , మీ బిడ్డ బ్రతుకు

దిద్దుకొనుట మీ చేతిలోదే , తలంప





మంచి యలవాట్లు , దైహిక – మానసికపు

సంతసము గూర్చు నారోగ్య సత్యములను ,

కోరికల మీద సంతృప్తి కూడి ,  కనిన

సంతు , శుభ లక్షణోపేత జనిత మగును



  రూపు , లలవాట్లు , బుధ్దులు , రోగములును

సర్వమును సంతతిని కూడి సంక్రమించు 

ననెడు సత్యాన్ని మరువని జనుల జాతి

దిన దినాభివృధ్ధి గను ,  సందియము లేదు