సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, ఏప్రిల్ 2016, మంగళవారం

పుట్టతెనుగు తేనె పలుకు .....



పద్యమందు , పల్లె పట్టులందు , అచటి
మనుజులందు , వారి మాటలందు ,
అందు తేనెలూరు ఆప్యాయతల తెల్గు
దనములందు తియ్యదనము కలదు .


పట్టణ వాసనలంటని
మట్టిన్ మన పలుకుబళ్ళు మనుచున్నవి
పుట్టతెనుగు తేనె పలుకు
పట్టి పిడిచి పద్యమందు వాడగ వలదా?

పద్యము లన్న నాంధ్రులకు ప్రాణము  పద్యము తెల్గువారి  వై
విధ్య వచో విధాయక ప్రవృత్తి  , నిరక్షర కుక్షియైన  తా
పద్యము జెప్పిగాని తన పల్కు ముగించడు తెల్గు నేలకున్
పద్యముకున్ గలట్టి యనుబంధము లిట్టివి , చూడ ముచ్చటౌ .

మూటలు గట్టి పద్యముల ప్రోవులు వోసిరి -  పల్లెటూళ్ళ 
తేటల తెల్గు మాటలను - తిక్కన పోతన వేమనాదు ,  లా
మాటల నేటి పండితులు మాటికి మాటికి గ్రామ్యమందురే ,
పోటుల గాళ్ళ వీళ్ళు  , కవి మూర్తుల బాటలు లెక్క చేయరా ?

చదువుట తోనె యర్ధమగు చాయలు దోచగ పద్యమాలికన్
బొదిగిన రామణీయకపు పొల్పులు దెల్పగ  తల్లి భాషకే
చదురులు గల్గు గాన  - సహజమ్మగు తెల్గు పదాల సొంపులన్
మదికి లయించి వ్రాయు గరిమల్ గల పద్యము లింపు గూర్చెడిన్ .



4 కామెంట్‌లు:

  1. లక్కాకుల వారా మజాకా :)

    పండితుల మాట మేలా ?
    పిండికొలది రోటిగాద ? పిడివాదము లా
    పండి! కవివరులు చెప్పిన
    ఖండన మాటల జిలేబి కసబిస జేసెన్

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏడ్పు గొట్టు వార లెంద రుండిన నేమి ?
      అండ నిల్చి యొక్క రుండ చాలు ,
      తాము గొప్ప యనెడు తప్పుడు వెధవలు
      మన సమాజమునకు పనికి రారు .

      తొలగించండి
  2. చాలా బాగున్నాయి పద్యాలు గురువు గారూ ...
    ___/\___ ...

    రిప్లయితొలగించండి