సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జులై 2019, శుక్రవారం

అన్నం పెట్టే మహత్ సంకల్పం

కుటుంబం లేదు ,
ఒంటరితనం ,
వయసుడిగింది ,
ఏ దిక్కూలేదు _
 ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో కొందరుంటారు .
కేవలం అలాంటివాళ్ళకు 20 మందికి అన్నం పెట్టే పని సంకల్పించాను . పెద్దలు ఆశీర్వదించండి .

ప్రతిరోజూ పదిమందికి
సతతము భోజనము పెట్టు సత్కార్యమనే
వ్రత మాచరించ బూనితి ,
హితులాశీస్సుల నిడుడు , మహిత గతి సాగన్ .

దైవకార్యమేని ధర్మకార్యంబేని
చేయబూని నపుడు స్థిరము గాగ
పరుల యర్థమేని పరసేవలను గాని
తీసుకొనమి నాకు తృప్తి నిడును .

పొసగ నా కడ కడు వసతియున్నంతలో
పూని పనులు సేయ బోలుదు , మతి
మంతులైన హితుల మన్ననల్ , దీవెనల్
వలయు , నితర మేమి వలవ దనఘ !

17 వ్యాఖ్యలు:

 1. మాటలతో కోటలు కట్టే ధీరులున్న బ్లాగ్లోకంలో మీలాంటి వారు అరుదే మాస్టారు.
  మీ మంచితనానికి జేజేలు. __/\__ ...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నా సంకల్పానికి తమబోటి మిత్రుల ప్రోత్సాహక , సానుకూల వాక్యాలు కొండంత బలం రావుగారూ ,
   ధన్యవాదాలు .

   తొలగించు
 2. లక్కాకుల మాస్టారూ, పెద్దమనసుతో మీరు చేపట్టిన సత్కార్యానికి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సార్ ,
   జైగారూ , మరో పది రోజులలో సదరు కార్యక్రమం తమ అందరి ఆశీస్సులతో ప్రారంభిస్తాను . విధి విధానాలు ఖరారు
   చేసుకున్నాను . అన్నంఅవసరమైన(ఆసరా లేని)వ్వక్తులను గుర్తిస్తున్నాను . ప్రారంభంలో ప్రతి నెలా పదివేలు ఖర్చు చేయడానికి నిర్ణయించుకున్నాను . మంచో చెడో తెలీదుగాని , ధార్మిక _ దైవకార్యాలేవి తలపెట్టినా , ఇతరుల సహాయ
   సహకారాలు తీసుకోవడం నాకిష్టముండదు . స్వంతంగా నిర్వహించడమే నా విధానము . మనసారా అభినందించిన
   మీకు ధన్యవాదములు .

   తొలగించు

 3. మీ కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగు గాక
  జిలేబులు కూడా అప్పుడప్పుడూ పెట్టడం మరువకండేం


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీరు తలపెట్టిన సత్కార్యం మీ సంకల్పబలం వలన నిర్విఘ్నంగా కొనసాగుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పెద్దలు నరసింహరావుగారికి నమస్సులు , ధన్యవాదాలు .
   తమ ఆకాంక్షకు కృతఙ్ఞతలు .

   తొలగించు
 5. అన్ని దానముల కన్న అన్నదానము మిన్న
  కన్న తల్లి కన్న ఘనము లేదు
  ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
  విశ్వదాభిరామ వినుర వేమ

  శుభం భూయాత్. అభినందనలు.

  ఫోటోలో వేంకయ్య స్వామి కదూ

  ప్రత్యుత్తరంతొలగించు


 6. అన్నార్తులకిక చేసెద
  నన్నా సేవయు విడువక నమ్మిక గా నే
  నున్నా మీకై యనుచున్
  మిన్నగ నావల్లయిన కమికిలి మెతుకులన్!


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉన్నాడు లెస్స వెంకయ ,
   ఉన్నాడిదె కొలువుదీరి యొద్దిక నెదలో ,
   అన్నీ తానై జూచును ,
   అన్నము బెట్టంగ కొదువయా ? మనకు హితా !

   తొలగించు
 7. నను జదివించిన గురులకు
  జన జగతికి గురుడు కృష్ణ జగధీశునకున్
  ఘన గురుడు వ్యాస మునికి
  ప్రణతులు శ్రీసాయినాధు పరమాత్మునికిన్

  మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు