ఒంటరితనం ,
వయసుడిగింది ,
ఏ దిక్కూలేదు _
ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో కొందరుంటారు .
కేవలం అలాంటివాళ్ళకు 20 మందికి అన్నం పెట్టే పని సంకల్పించాను . పెద్దలు ఆశీర్వదించండి .
ప్రతిరోజూ పదిమందికి
సతతము భోజనము పెట్టు సత్కార్యమనే
వ్రత మాచరించ బూనితి ,
హితులాశీస్సుల నిడుడు , మహిత గతి సాగన్ .
దైవకార్యమేని ధర్మకార్యంబేని
చేయబూని నపుడు స్థిరము గాగ
పరుల యర్థమేని పరసేవలను గాని
తీసుకొనమి నాకు తృప్తి నిడును .
పొసగ నా కడ కడు వసతియున్నంతలో
పూని పనులు సేయ బోలుదు , మతి
మంతులైన హితుల మన్ననల్ , దీవెనల్
వలయు , నితర మేమి వలవ దనఘ !
మాటలతో కోటలు కట్టే ధీరులున్న బ్లాగ్లోకంలో మీలాంటి వారు అరుదే మాస్టారు.
రిప్లయితొలగించండిమీ మంచితనానికి జేజేలు. __/\__ ...
నా సంకల్పానికి తమబోటి మిత్రుల ప్రోత్సాహక , సానుకూల వాక్యాలు కొండంత బలం రావుగారూ ,
తొలగించండిధన్యవాదాలు .
లక్కాకుల మాస్టారూ, పెద్దమనసుతో మీరు చేపట్టిన సత్కార్యానికి అభినందనలు.
రిప్లయితొలగించండిసార్ ,
తొలగించండిజైగారూ , మరో పది రోజులలో సదరు కార్యక్రమం తమ అందరి ఆశీస్సులతో ప్రారంభిస్తాను . విధి విధానాలు ఖరారు
చేసుకున్నాను . అన్నంఅవసరమైన(ఆసరా లేని)వ్వక్తులను గుర్తిస్తున్నాను . ప్రారంభంలో ప్రతి నెలా పదివేలు ఖర్చు చేయడానికి నిర్ణయించుకున్నాను . మంచో చెడో తెలీదుగాని , ధార్మిక _ దైవకార్యాలేవి తలపెట్టినా , ఇతరుల సహాయ
సహకారాలు తీసుకోవడం నాకిష్టముండదు . స్వంతంగా నిర్వహించడమే నా విధానము . మనసారా అభినందించిన
మీకు ధన్యవాదములు .
రిప్లయితొలగించండిమీ కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగు గాక
జిలేబులు కూడా అప్పుడప్పుడూ పెట్టడం మరువకండేం
జిలేబి
తమవంటి హితుల తథాస్తులు తప్పక ఫలితాలనిస్తాయి ధన్యవాదాలు .
తొలగించండిమీరు తలపెట్టిన సత్కార్యం మీ సంకల్పబలం వలన నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
రిప్లయితొలగించండిపెద్దలు నరసింహరావుగారికి నమస్సులు , ధన్యవాదాలు .
తొలగించండితమ ఆకాంక్షకు కృతఙ్ఞతలు .
అన్ని దానముల కన్న అన్నదానము మిన్న
రిప్లయితొలగించండికన్న తల్లి కన్న ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ
శుభం భూయాత్. అభినందనలు.
ఫోటోలో వేంకయ్య స్వామి కదూ
ధన్యవాదములు మరియు నమస్సులు శర్మగారూ ,
తొలగించండివెంకయ్యస్వామిగారే .
Bless You
రిప్లయితొలగించండిThank you sir ,
తొలగించండిGreat deed, Sir!
రిప్లయితొలగించండిThank you LALITHAMMA ,
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅన్నార్తులకిక చేసెద
నన్నా సేవయు విడువక నమ్మిక గా నే
నున్నా మీకై యనుచున్
మిన్నగ నావల్లయిన కమికిలి మెతుకులన్!
జిలేబి
ఉన్నాడు లెస్స వెంకయ ,
తొలగించండిఉన్నాడిదె కొలువుదీరి యొద్దిక నెదలో ,
అన్నీ తానై జూచును ,
అన్నము బెట్టంగ కొదువయా ? మనకు హితా !
నను జదివించిన గురులకు
రిప్లయితొలగించండిజన జగతికి గురుడు కృష్ణ జగధీశునకున్
ఘన గురుడు వ్యాస మునికి
ప్రణతులు శ్రీసాయినాధు పరమాత్మునికిన్
మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు