“ ఏమి
విజయమ్మా ఈరోజు పిల్లలకు ఏమి వండి పెడుతున్నావు “
“ ఏముంది
సారూ అన్నమూ , సాంబారూ , రసమూను “
“ అవును
, ఈ రోజు మంగళ వారం కదా “
“ అర్థమయ్యింది
సారూ , మంగళవారం గుడ్లు వండాలని కదా మీరనేది “
“ మరి !
“
“ ఒక్కొక్క
పిలగాడికి రూపాయి పావలా ఇస్తున్నారు .
గుడ్డు రొండు రూపాయలు . వారానికి
రెండు
సార్లు ఏడ దెచ్చేది . మీకు దెలవందేముంది సారూ .
అదికూడా నాలుగు నెలలకోసారి బిల్లు లిస్తున్నారు .
బతుకు దెరువు లేక బడి పిల్లలకు వండి పెట్టడానికి ఒప్పు కుంటిని .
ఏమి
చేసేది . “
నేను గవర్ణమెంటు హైస్కూలు
ప్రథానోపాధ్యాయులుగా నా స్కూల్
కాంప్లెక్సు పరిధిలోని
కొన్ని
ప్రాథమిక పాఠశాలలు సందర్శించిన సందర్భమిది . ఇది నాలుగేళ్ళ నాటి సంభాషణం .
-----
పదేళ్ళ క్రితం విజయమ్మ ఆ మండలానికి
మండలాథ్యక్షురాలు . ఆ వూరి యం.పి.టి.సి
యస్.సి
మహిళకు రీజర్వు కావడం వల్లా , ఊరి రాజకీయ నాయకుడు ఎంపిక చేయడం వల్లా
విజయమ్మ
యం.పి.టి.సి అయ్యింది .
మండలాథ్యక్ష పదవి ఆనాడు జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది . మండలంలో
గెలిచిన
యం.పి.టి.సి లలో విజయమ్మ ఒక్కరే మహిళ కావడం వల్ల అనూహ్యంగా మండలా
థ్యక్ష
పదవి ఆమెను వరించింది .
అంతకు క్రితం ఆ మండలానికి
మండలాథ్యక్షుడుగా ఉన్న ఉన్నత సామాజిక వర్గానికి
చెందిన
రాజకీయ నాయకుడు బలాఢ్యుడు . అంగ , అర్థ బలంతో ఆ మండలంలో ఆయన హవానే నడుస్తూ ఉంది .
ఇక షరా మామూలే . మండలాథ్యక్షురాలు
విజయమ్మ ప్రతిరోజూ పొద్దున్నే సదరు శ్రీవారి
ఇంటికి
వెళ్ళడం , సాయంత్రం వరకూ ఆయింటి యజమానురాలు చెప్పిన పనులు చేయడం , రాత్రికి ఇల్లు చేరడం
– ఇదీ విజయమ్మ దిన చర్య .
విజయమ్మకు పొడి పొడిగా సంతకం చేయడం
నేర్పించినారు . చెక్కులూ , ఉత్తర్వులూ ,
తదితరాల
మీద అయ్యగారి ఇష్టాయిష్ఠాల మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం ,
అప్పుడప్పుడు
జరిగే సమావేశాలలో ఒక అనామకురాలి లాగా బిక్కు బిక్కుమంటూ కూర్చోడం .
అధికారులూ , అనధి కారులూ ఆమెనసలు
మండలాథ్యక్షురాలిగా భావించిన దాఖలాలు
కనబడవు
. అధికారమూ . ఆర్భాటమూ అంతా ఆ పెద్దాయనదే మరి . విజయమ్మ నామ మా
త్రం
గానే మిగిలి పోయింది . పదవి పోయిన తర్వాత బతుకు తెరువు కోసం నానా పాట్లూ పడుతున్న
ఇలాంటి
విజయమ్మలను చూస్తున్నప్పుడు మనస్సు చివుక్కు మంటోంది . ఇది పదేళ్ళ నాటి
సంగతి
. ఐనా , మార్పు కోసం ఆసించడం తప్ప ఎక్కడా ఆ ధాఖలాలు సుదూరంగా కూడా కనిపించడం లేదు .
-----
ఉన్నత సామాజిక వర్గాల మహిళలతో సహా
స్త్రీలు , బడుగు – బలహీన వర్గాలూ స్థానిక
రిజర్వేషన్ల
ద్వారా అందిన పదవులను అనుభవించే పరిస్థితులే లేవు . అధికారమంతా రాజకీయ ,
సామాజిక
, ఆర్థిక బలాఢ్యుల చేతుల్లోకి బదిలీ అవుతున్నప్పుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్న
తి
ప్రశ్నార్థకమే .
ఈ సామాజిక దురవస్థకు కారణం మనకు తెలుసు
. నిరోధించడానికి మన బాధ్యతగా ఈ సమాజానికి మనమేమి చెప్పాలో యోచించండి .
రిప్లయితొలగించండిప్రశ్న పాఠకులకే వేసారా మాస్టారు?
"బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ",అని చదువుకున్నాము కానీ,చీమలన్ని ఐకమత్యం తో కలిసి,వారికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఎదురు తిరిగితే మార్పు రాదంటారా?
అంగ , అర్థ బలవంతుడైన రాజకీయ నాయకునికి నిలువెల్లా విషమే . బలహీనులను ఏకం కానివ్వడు . విద్యావంతులు చురుకుగా వ్యవహరించి సమాజాన్ని చైతన్య పరచ
తొలగించండిగల్గితే ఇలాంటి ఎన్నో సామాజిక దురవస్థలు నిరోధించ బడతాయి .
స్పందనకు ధన్యవాదాలు .
ఇప్పటికి ఇదే జరుగుతోంది, మార్పెలా వస్తుందో!
రిప్లయితొలగించండితమబోటి సమాజ హితైషులఆశీస్సులే మార్పుకు శ్రీకారాలు . ధన్యవాదాలు .
తొలగించండి