ఇరు
వర్గాలు – రెండుపంచాంగాలు నాటి తిథి , నక్షత్రాల ప్రవేశ విషయంలోవాదోప వాదాలు - సామరస్యం కొరవడిన అతిశయాలు -
సందర్భమా
- ఆందోళన కరం
అసలు
విషయంలోకి వద్దాం . ఆ రోజు వైద్యం కోసం మా ఆవిడని హాస్పిటల్
కు
తీసుకెళ్ళడం జరిగింది . అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ .
రిసెప్షన్
హాల్లో నలుగురైదుగురు ఆడవాళ్ళూ , నలుగురైదుగురు మగవాళ్ళూ
పంచాంగాలు
తెచ్చుకొని మరీ సప్రమాణంగా వాదించు కుంటున్నారు .
అమ్మాయికి నెలలు నిండినట్లుంది . సిజేరియన్
అవసరమైన పరిస్థితిలా
కనబడుతోంది
. తొలి కాన్పేమో . అమ్మాయిలో ఆందోళన కనబడుతూఉంది.
హైపర్టెన్షన్కు
గురై ఉండవచ్చు . అందువల్ల నార్మల్ డెలివరీ
వరకూ వెయిట్
చెయ్యడం
కుదరక పోవచ్చు . డాక్టర్ సిజేరియన్కు సిధ్ధం చేస్తున్నట్టున్నారు .
థియేటరు
వద్ద ఆ హడావిడి కన్పిస్తూ ఉంది . ఇదీ సీను .
అయినా
అమ్మాయి ఉన్న ఈ పరిస్థితిలో అసలు వీళ్ళకు తిథులూ నక్షత్రా
ల కోసం
వాదులాడు కోవడానికి నిలకడెలా వచ్చిందో నాకైతే అంతు పట్టలేదు .
ఈ
కథనంలో కాస్తంత కూడా అవాస్తవంలేదు . తిథి ప్రవేశించిందాకా ఆగాల్సిందే నని
పట్టుబట్టి కాస్తంత ఆలస్యం జరిగి , ఆ తల్లీ బిడ్డలకేదైనా
ప్రమాదం
జరిగితేనో –
ఇరువైపుల వాళ్ళల్లో- ఆడవాళ్ళైతే కట్టూ
బొట్టూతో ఆర్భాటంగానూ , మగ
వాళ్ళైతే
సూటూ బూటూతో అతిశయంగానూ, బాగా చదువుకున్నవాళ్ళ
లాగా
కన్పిస్తున్నారు .
ఆధ్యాత్మికత , దైవం మీద నమ్మకం – ఈ రెండు
భావనలూ – వీటిలోని
సత్యాసత్యాలు
పక్కన పెడితే – మనిషికి పరిణతినిచ్చి , కట్టడి చేసి ,
సమాజం
కొంతవరకు సజావుగా నడవడానికి దోహద పడ్డవి .
అడుగడుగునా భ్రమలతో , భయాలతో భద్రతలేని
జీవన యానంలో
సతమత
మయ్యే మనిషి – తనకంటే శక్తి మంతమైన ఉనికిని గుర్తించి,
ఆ
శక్తిని దైవంగా భావించి , ఆపదలో తనకు ఆసరా కోసం నమ్మి ,
ఆరాధించడం
మొదలై ఉండవచ్చు .
కానీ , జరుగబోయే పరిణామాలను ముందే
గ్రహించగలగడం – తదను గుణంగా భవష్యత్తును
తన అజమాయిషీలోకి తెచ్చుకో జూడడం దురాశే
కాదు , అసాధ్యం కూడాను .
మరణించేదాకా హాయిగా బతకాలని కోరుకుంటాము .
సాధ్యమయ్యే నా?
భవిష్యజ్జీవితంలో జరిగే పరిణామాలేమిటో తెలుసుకో
గల్గితే ?
ఎవరైనా
చెప్పగల్గితే ? ఈ ఊహే
చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది .
ఈ
బలహీనత లో నుంచే , ఈ
దురాశలోనుంచే ఏర్పడిన ’ ఒక సంప్రదాయం’ భారతీయ జీవన విధానంలో భాగమై
, శాస్త్ర మనే భ్రమ కల్పించింది .
నేటికీ
వెర్రితలలు వేస్తున్న ఈ జాతక చక్రాల మాయ వీడే దెన్నడో ?
మన
సమాజాన్ని బ్రమలలో ముంచే ఇలాంటి దుర్మార్గాలు నశించే దెన్నడో ?
రావణుడు మేఘనాధుడికి జన్మనిచ్చినట్లు నేడు జరుతున్నది, నిక్కచ్చి నిజం
రిప్లయితొలగించండిభ్రమలనుండి బయటపడాలనీ , బలహీనతలను అధిగమించాలనీ సమాజాన్ని ఆశీర్వదించండి శర్మగారూ ! ధన్యవాదాలు .
తొలగించండిప్చ్.. ఏం చేస్తాం మాష్టారు, నాకు కూడా ఇలాంటివారు కొందరు పరిచయమే!
రిప్లయితొలగించండిపంచాంగాలు డెలివరీలను నిర్ణయించడం .....ఆ యా ఆశల నుండి పుట్టిన బిడ్డలు ఆ యా ఆకాంక్షల ఉన్నతత్వాలను పొందుతారా ! బిడ్డ పుట్టిన తర్వాత ఆశలకనుగుణంగాతీర్చి దిద్దుకోవాల్నా? ఏది భ్రమ ? ఏది నిజం ?
తొలగించండిధన్యవాదాలు.
మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
రిప్లయితొలగించండిక్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html