అందరి జీవితా లారోగ్య దీపాల
వెలుగులతో నిండి విరియు గాత !
అందరి జీవితా లైశ్వర్య దీపాల
వెలుగులతో నిండి విరియు గాత !
అందరి జీవితా లందున పరిపూర్ణ
విజయాల వెలుగులు విరియు గాత !
అందరి జీవితా లందు భద్రత కల్గి
వెలుగుల రక్షణ విరియు గాత !
మంత్ర తంత్రాలు జ్యోతిష్య మాది వృత్తు
లు గొని , అంధ విశ్వాసములు రగిలించు
బుధుల దుర్మార్గ మికనైన పోవు గాత !
విశ్వ కళ్యాణ ధీధితుల్ వెలయు గాత !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి