అనురాగపు మనోజ్ఞతల అపురూపమా !
నట్టింటను నడయాడే నయన మనోహరమా !
అమ్మా నాన్నల నోముల కమృత ఫలమా !
పరాశక్తి ప్రతిరూపపు ప్రకృతి వరమా !
ఏ పదముల నిను బొగడను ఇంతీ !
ఇల వెలసిన అమృత పూర్ణ స్రవంతీ !
నీవు లేక మగ జాతికి నిలువ నీడ లేదు
నీవల్లే పురుషార్థపు పుణ్య ఫలము పొందు
నీ కడుపున ప్రభవించుటె నిజమని తెలియని మూర్ఖుడు
నీ నీడనె బ్రతుకు నీడ్చునిత్యాహంకారుడు
అజ్ఞానపు టంథకార పురుషాహంకారం
‘ అమృతమయి ’ జ్ఞానజ్యోతి
అండతోనె దూరం
ప్రతి మహిళా ‘ పరాశక్తి ‘.
ప్రపంచాన్ని నడిపించే
ప్రతిభా పాటవ శక్తుల
ప్రభావాల ప్రతిరూపం
ప్రతి తల్లీ తన తనయుడు
థర్మ నిరతు డవ్వాలని
ప్రతిన బూని శాసిస్తే
థర్మ పతితు డయ్యేనా ? ? ?
_ అమృత మయులైన
మాతృ మూర్తులందరికీ
మహిళాదినోత్సవ
శుభాకాంక్షలు _
_ అమృత మయులైన
మాతృ మూర్తులందరికీ
మహిళాదినోత్సవ
శుభాకాంక్షలు _
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి