వొళ్ళంతా బంగారం
ఓ చోటే సింగారం
బంగారం అసలైతే
సింగారం సిసలు
ఓ చోటే సింగారం
బంగారం అసలైతే
సింగారం సిసలు
చుక్కల తళుకులు విరిసిన
విను వీధులు బంగారం
అద్భుతాల పాల పుంత
అందులోని సింగారం
విను వీధులు బంగారం
అద్భుతాల పాల పుంత
అందులోని సింగారం
అనంత జ్యోతులు నిండీన
పాల పుంత బంగారం
అవనిలోని చైతన్యం
అందులోని సింగారం
పాల పుంత బంగారం
అవనిలోని చైతన్యం
అందులోని సింగారం
ప్రొద్దు పొడుపు పరుచు కున్న
నేలంతా బంగారం
బుధ్ధి జీవి ప్రభవించుటె
అందులోని సింగారం
నేలంతా బంగారం
బుధ్ధి జీవి ప్రభవించుటె
అందులోని సింగారం
ఆమని ఋతురాగంతో
ప్రకృతి శోభ బంగారం
అందమైన పూలబాల
అందులోని సింగారం
ప్రకృతి శోభ బంగారం
అందమైన పూలబాల
అందులోని సింగారం
పున్నమి వెన్నెల పొడవున
అర్ణవమే బంగారం
అంతులేని అగాధమే
అందులోని సింగారం
అర్ణవమే బంగారం
అంతులేని అగాధమే
అందులోని సింగారం
సత్య శోధనలు నిండిన
విఙ్ఞానమె బంగారం
ఎరుక గల్గు ప్రతి మెదడూ
అందులోని సింగారం .
విఙ్ఞానమె బంగారం
ఎరుక గల్గు ప్రతి మెదడూ
అందులోని సింగారం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి