శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
హితబోధ చేసిన హితు డతండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి రుజ బాధలను బాపి
తాననుభవించిన త్యాగ శీలి
' సాయి ! కాపాడ రారా ' యన్న తక్షణ
మాదుకొను కరుణామయు డతండు
సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు – శరణంచు శరణు వేడి
చరణములు తాకి తరియింత్రు జనులు – శరణు
శరణు గురు పౌర్ణమీ శుభంకర దినమున .
ప్రపంచానికి మార్గ దర్శనం చేసిన మహాను భావులందరూ గురువులే .
ఈ గురు పరంపరలో వ్యాస భగవానుని పేర గురు పౌర్ణమి జరుపుకోవడం
ఆనవాయితీ . ఈ గురు పౌర్ణమి పర్వ దినాన్ని తాను జీవించినంత కాలమూ
శ్రీ శిరిడి సాయి బాబా వేడుకగా జరిపించేవారు . ఆయన సమాధి చేరిన తదుపరి
శ్రీ సాయి నాధుని మందిరాలలో గురుపౌర్ణమి వేడుకల సంబరాలు ఘనంగా
జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది .
ప్రతి యొక్కరు సాయి తనకు
హితుడని భావించు సాన్ని హిత్యము చూడన్
అతడు మన గుండె నిండా
సతతము కొలువుండు టెల్ల సత్యమె యందున్ .
గురు పూర్ణిమ శుభ దినమున
గురురాట్ శ్రీ సాయి నాధు గొలిచిన జగతిన్
గురుతెరిగి సాయి నాథుడు
తిరముగ దు:ఖములు బాపి తీరము జేర్చున్ .
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై .
........ వ్యాస భగవానుని పేర గురు పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీ . ఈ గురు పౌర్ణమి పర్వ దినాన్ని తాను జీవించినంత కాలమూ శ్రీ శిరిడి సాయి బాబా వేడుకగా జరిపించేవారు . ఆయన సమాధి చేరిన తదుపరి ......
రిప్లయితొలగించండి...... సాయిభక్తులు వ్యాసుణ్ణి మరచారు. సాయి మహరాజ్ గారిని గురించి భజనలూ పూజలూ చేస్తూ పోయే వీళ్ళలో చాలా మందికి వేదవ్యాసుడెవరో కూడా తెలియదేమో!
ఈ రోజు భగవన్ వేదవ్యాసులవారి జయంతి అన్నది క్రొత్తదేవుళ్ళ భక్తిలో మునకలు వేస్తున్న మనవాళ్ళు దాదాపుగా మరచిపోయారేమో!
ఒకపాతటపా: వ్యాస పూర్ణిమ - గురుపూర్ణిమ ( http://smarana-bharathi.blogspot.in/2012/06/blog-post_2883.html )
రిప్లయితొలగించండి...... సాయిభక్తులు వ్యాసుణ్ణి మరచారు. సాయి మహరాజ్ గారిని గురించి భజనలూ పూజలూ చేస్తూ పోయే వీళ్ళలో చాలా మందికి వేదవ్యాసుడెవరో కూడా తెలియదేమో!
రిప్లయితొలగించండి........ ఈ మాటల వల్ల అర్థమౌతున్నదేమితంటే , మన పండితులు జన సామాన్యాన్ని ఎంత గొప్పగా దూరం పెట్టేశారా అని ,
ధన్యవాదములు సర్ ,