సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

హే మహాత్మ ! రాథికాశ్యామ ! మీ ప్రేమ రాగమయము

 
 
 
 
 
 
 
దూరాన చంద్రుండు దొంగ చూపులు చూచి
కొలనిలో వెన్నెల  చిలుకు చుండ
రాయంచ మిథునము  రాస క్రీడలు మాని
చకిత లోచనులయి  సాక్ష్యమివ్వ
కొమ్మ కొమ్మన పూలు కమ్మని పరిమళ
సౌహార్థములు వెదజల్లు చుండ
రాధిక కురులు  కరాన దువ్వుచు  తథే
కపరత  కృష్ణుండు  కనగ నయ్యె
 
అద్దమున  రాథ  కృష్ణుని ముద్దు మోము
గాంచు చున్నది ,  తన మోము గాదు ,  చూడ
నెంత గట్టిదో బంధమ్ము ,   హే మహాత్మ !
రాథికా శ్యామ !  మీ ప్రేమ  రాగ మయము .
 
 
 
 
 
 
 
 
 

2 కామెంట్‌లు:

  1. రాధాకృష్ణుల మధ్య వున్న అనురాగభరితమైన ఆత్మీయ అనుబంధాన్ని, మైమరచే తన్మయత్వాన్ని, పరవళ్ళు త్రొక్కించే ప్రేమతత్వాన్ని భక్తుల హృదయం పరవశించి అలరారేటట్లు అక్షరీకరించారు. అభివందనములు మాస్టారు గారు.

    రిప్లయితొలగించండి
  2. చిత్రం చూడగానే .... మనోజ్ఞమై ఆకట్టుకుంది . రాధాకృష్ణుల ప్రేమ తత్త్వ చిత్రానికి పద్యరూపం
    మనోఫలకం మీద ఆవిష్కృతమయ్యింది . అక్షరరూపాన్ని సంతరించుకుంది .
    ధన్యవాదములు భారతి గారూ ,

    రిప్లయితొలగించండి