సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, ఆగస్టు 2016, మంగళవారం

తెలుగు పద్యం .....

తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు పద్యము కొల్వు దీర వలయు

కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు

2 కామెంట్‌లు:



  1. కొలువు తీర్చి లక్కాకుల గురువు నమర
    పలుకు లందలి పదములు పదనిసలన
    నడచె నిచట తేట తెలుగు నాట్య రాణి
    పద్దెపు కుసుమములనిట పంచి బెట్టి!

    జిలేబి

    రిప్లయితొలగించండి