సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, అక్టోబర్ 2018, శుక్రవారం

కొల్హాపూర్ మహలక్ష్మీ అమ్మ వారి దర్శనం




పాదుగ భారతావనికి భద్ర మొసంగగ , నమ్మవారి ' య
ష్టాదశ శక్తి పీఠములు ' స్థాపిత మైనవి , యందు కొల్హపూర్
ప్రాదుర పట్టణాన మహలక్ష్మి యనన్ గల ' దమ్మ  ' , శక్తియై ,
నాదు పురాకృతమ్మనగ  నా యమ దర్శన భాగ్య మేర్పడెన్ .

భారతావని , ధరణిలో , బహు ముఖముల
శక్తి సంపన్న ,   మందు   నీ శక్తి పీఠ
ములు , హిమాలయము మొదలు పూజిత మయి
సేతువు వరకు వ్యాపించి చెలువు గాంచె

మూడు ముఖాలతో ముమ్మూర్తులా వెల్గు
మూలపు టమ్మణ్ణి మోము జూస్తి
కలహంస విలసిత కమలాసనము మీద
మిఱు మిట్లు గొలుపు  నా మించు జూస్తి
నాల్గు చేతుల యందు నారాయణుని వోలె
తగ గదా ఖడ్గాది ధరణ జూస్తి
ఐదు పడిగెల పాము పాదుగా తలమీద
గొడుగు పట్టిన తీరు తొడుగు జూస్తి

బ్రహ్మ విష్ణు శివులు పడి పడి మ్రొక్కెడు
తల్లి పరమ పాద తరణి జూస్తి
కొల్హ పూరు లోన కొలువైన మహలక్ష్మి
అమ్మవార్ని జూస్తి  నంజలించి .



12 కామెంట్‌లు:

  1. మీ యాత్ర సఫలమైనందుకు సంతోషం మాస్టారూ.
    ఒక సందేహం. గుడిలో విగ్రహాన్ని ఫొటో తియ్యడానికి మిమ్మల్ని ఆలయాధికారులు అనుమతించారా?

    రిప్లయితొలగించండి


  2. వెడలన్ కొల్హాపురికిన్
    సడలని నమ్మకము తోడు జలధిజ దయనే
    బడసితి దర్శనము కలిగె
    వడివడిగాను మదినిండు పదిలంబుగనన్ !


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలధిజ కాదు ,
      శక్తి , మహలక్ష్మి రూపంలో .
      అష్టాదశ శక్తి పీఠాలలోది
      తమ పద్య వ్యాఖ్య
      కు ధన్యవాదాలు .

      తొలగించండి


    2. ధన్యవాదములు శాంభవి అన్నమాట


      వెడలన్ కొల్హాపురికిన్
      సడలని నమ్మకము తోడు శాంభవి దయనే
      బడసితి దర్శనము కలిగె
      వడివడిగాను మదినిండు పదిలంబుగనన్ !

      తొలగించండి
  3. జిలేబీ నామధారుల కొక పద్యము వినమ్రతతో .....


    ఎంతటి విద్యమానమిది ! యెచ్చట నేర్చితి రండి ! మీరు ? మీ
    రెంతటి విఙ్ఞులైన , నిటు లీ పద పద్య విలోల కేళికా
    మంత మనోఙ్ఞ భూమికను మాయురె ! మోయుట మేము నేర్తుమే !
    బంతుల నాడి పద్యములు , భావములున్ కదన మ్మొనర్తురే !



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాయురే ! ఇదెంతటి మాయరే ! ఓ ప్రక్క మీకింత యభిమాన మేలొకో యని వింత పడిరి ! అంతనే యబ్బుర పరచుచు 'పద పద్య విలోల కేళిక మంత మనోఙ్ఞ భూమిక మోయుట మేము నేర్తుమే !' యటంచు మా ప్రియ మామి పై మరిన్ని మాటల మాలలల్లి, మా పాటల మించితిరి, మరపించితిరి - ఔరౌరా యనిపించితిరి ! పూ బంతుల తేలియాడించి మా మామిని 'పలుకుకలికి' తురాయి బిరుదాంకిత, పులకాంకిత గావించితిరి. అహో మీ బుధ విధముల నెరుంగుట, మాయురే, మా బోంట్ల తరమే !!! మీరువురునూ హిత, సన్నిహితులగుట మాకునూ ఓ వరమే ... :)

      తొలగించండి
    2. అబ్బ ! బండి వారూ ! మీరు మరీను ,
      వారి పద పద్య కదనరంగ పటిమను
      అప్పుడపుడూ నాకు తోచిన భాషలో
      కొండాడుతూ ఉంటాను . తమకు పోటీ
      కానే కాదు .
      మీరు మీ పాటల డప్పుల చప్పుళ్ళ
      మ్రోతలు మ్రోయించండి మరి .
      జగన్మాతను తలచక పోయినా ,
      ఈ పద్యాన్నైనా తలచి ,
      కొలిచి నందుకు ధన్యవాదాలు .

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. కొలిచితి జగన్మాత శరణు శరణు ... __/\__ ...

      ఈ డప్పు వాయిద్యాన్ని కూడా ఆలకించండి ... :)
      https://nmraobandi.blogspot.com/2018/10/duet-karaoke-compatible.html

      తొలగించండి
  4. శరన్నవరాత్రి శుభాకాంక్షలు !

    ఈ రోజు ఈనాడులో కొల్హాపూర్ అమ్మవారి గురించి వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  5. మీకు మహలక్ష్మీ రూపులో ఉన్న జగన్మాత
    ఆశీస్సులు కలుగు గాత!

    రిప్లయితొలగించండి