సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, మే 2019, మంగళవారం

ఆంధ్రా జనా స్సుఖినో భవంతు


విభజించి ఆంధ్రకు  విద్రోహ మొనరించి
ఘనశత్రువై నిల్చె కాంగిరేసు ,
విభజన తోడుగా విద్రోహ మొహరించి
తదుపరి బీజేపి తాను నిలిచె ,
పాలనా రతుడని  బాబు నెంపిక చేయ
సొంత మనుజుల చేత చింతదీర్చె ,
రాజధానీ లేదు  ప్రజల బాగూ లేదు
నాయకుల్ దోపిడీ చేయ బట్టి ,

మొదటి శత్రువు కాంగ్రెసు , మది దలంప
రెండు బీజేపి , మూడు సారించి చూడ
తెలుగు దేశము శత్రువుల్ , తెలియ నొకటి
మించి యింకోటి ,  మన పుట్టి ముంచినారు .

అతి సమర్థుడనుచు మితిమీరి వోట్లేసి
ముఖ్యమంత్రి జేయ ముదురు గనక
రాజధాని యనుచు రంగులు చూపించె
బైర్లు క్రమ్మె తెలుగు ప్రజకు కళ్ళు .

జిమ్మిక్కుల కోట్లు పడవు
తిమ్మిని బమ్మినిగ జేయు ధిషణుల నికపై
నమ్మరు జను , లెవరు తమకు
కమ్మని పాలన నొసగిన , గణుతింత్రు సదా .

వైసీపీ పాలనలో
వాసింగనుగాక ! ఆంధ్ర , వరణీయంబై ,
మోసాలకు , వేషాలకు ,
కాసుల దందాకు తొలగుగాక ! వినుతమై .

14 కామెంట్‌లు:

  1. మడుగులు చెరువులు వాగులు వంకలు కనువిందు చేయాలి. పల్లేర్లు మొలిచిన పడావు బీళ్లు ఆకు పచ్చ రంగుతో కళకళలాడాలి. మెట్ట ప్రాంతాల బక్క రైతుల బరువు బతుకులు బాగు పడాలి.

    సోమశిలకు నీళ్లు రావాలి. గంగమ్మ పరవళ్లు చూసి పులకించిన లక్కాకుల మాస్టారు ఆనందంతో రాసిన కవితలు మేమందరం చదవాలి.

    రిప్లయితొలగించండి
  2. జైగారూ ,
    మీ ఆకాంక్షలకు కృతఙ్ఞతలు .
    ఇది పరస్పర శుభాకాంక్షలకు శుభతరుణం .
    మీకు నా హార్దిక శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్యూ సార్.

      డా. దాశరధి "గాయబడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో" అని బాధ పడ్డారు.

      బక్క రైతు కష్టాన్ని మొత్తం కాకపోయినా కొంతయినా అర్ధం చేసుకున్న నాయకులు వస్తే కవి హృదయం ఉప్పొంగుతుంది, తద్వారా ఇంకా గొప్ప సాహిత్యం వెలువడుతుందని నా ఆశ, నమ్మకం కూడా.

      తొలగించండి
  3. బొక్కిన ప్రజాధనమ్ములు
    క్రక్కింతురట కద ! , ఇదేమి గ్రహచారంబో !
    బొక్కలిరగ దన్ని పసుపు
    కొక్కుల బోనులను బెట్టి క్రుక్కుదురటగా !

    రిప్లయితొలగించండి
  4. పువ్వొకటే రక్షించెడు ,
    నెవ్విధి నైనన్ మహాత్మ ! నీవే దిక్కీ
    గువ్వల కాపాడు డనుచు
    నెవ్వగ మోదీని గొలువ , నేతలు పరుగో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెవిలో పువ్వు
      నెత్తిన ఫానూ
      చేతికి చిప్ప
      సైకిలుకి బ్రేకు
      గ్లాసుపై జోకు
      ఇదండీ తెలుగు వోటరు తీర్పు

      తొలగించండి


  5. మోదీ యే దిక్కాయెను
    మా దేశమ్మున జిలేబి మాదిరి రాజా
    సాదా మడిసియతడు దిగె
    గోదాలో భరతమాత కొమరారంగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. సగటు భారతీయ జనగణ బాధలు
    తెలిసి , వారికొఱకు తీసుకున్న
    నిర్ణయాలు లేవు , నేత మోడీ పాల
    నమున , మీద నెటుల నమ్మవచ్చు ?

    రిప్లయితొలగించండి
  7. చిత్తశుధ్ధి గలిగి చేయంగ తలపున్న
    పాలకులకు ప్రకృతి పరవసించి
    సహకరించు , మొయిలు సాగి గొడుగు వట్టె
    జగను పదవి నెక్కు సమయమందు .

    రిప్లయితొలగించండి
  8. ఐదేళ్ళు వాన లెరుగక ,
    బాధలుపడితిమి , తొలంగె , వర్షామృత సం
    మ్మోదమయంబయి ఆంధ్రా ,
    మీదట హర్షాతిరేక మిళితం బగుతన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అదిగో జగనుడి కొరకై
      పదిలంబగుచుండె మొయిలు ప్రజలకికన్ మం
      చి దినములే! దేవుని దయ
      కుదురుగ కనిపించుచుండె కొంగు పసిడిగాన్!


      జిలేబి

      తొలగించండి
    2. "వరద గూడు గడితె వానొచ్చునంట, బురద పొలము దున్ని మురిసున్నరంత": నందిని సిద్దారెడ్డి

      తొలగించండి
  9. మాస్టారు, ఎప్పటిలా పద్యాలు మధురం, పద్యాలలో రాజకీయ విశ్లేషణ చతురం.

    రిప్లయితొలగించండి