పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
మాయెదలో కొలువుంటివి
రేయింబవళులు శుభాంగ ! కృష్ణా ! యిటులే ...
నీయెదపై తలనానిచి
హాయిగ నిదురోవుభాగ్య మడిగితి తండ్రీ !
ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టినిరచియించు నప్పుడు రమణ మీరఅనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టినికాచి రక్షించు ప్రకరణ మందుసంకర్షణు డితడు సకల సృష్టి హరించుపట్టున ప్రళయ తాపములయందువాసుదేవు డితడు వర పరమాత్మయైసర్వము తానయి పర్వునపుడువిష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచువేద వేద్యు లరసి వేడు నపుడుచిన్ని కృష్ణు డితడు చేరి యశోదనుముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు .
ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
రిప్లయితొలగించండిరచియించు నప్పుడు రమణ మీర
అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
కాచి రక్షించు ప్రకరణ మందు
సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
పట్టున ప్రళయ తాపములయందు
వాసుదేవు డితడు వర పరమాత్మయై
సర్వము తానయి పర్వునపుడు
విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
వేద వేద్యు లరసి వేడు నపుడు
చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను
ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు .