సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, జులై 2021, గురువారం

ఓహో ! చపాతీ ఇలా కూడా చెయ్యొచ్చు !

 రుద్దేది గుండు మీదా ,

అద్దుచు కాల్చేది చూడు డైరన్ మీదా ,

అద్దిర ఇల్లాల్లంటే ,

బుధ్ధులు మరి కొత్త కొత్త పోకడలు గదా !


11 వ్యాఖ్యలు:

 1. బాబోయ్! మా ఆవిడకు చూపెట్ట నిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చిత్రం , పద్యంకంటే సార్ ,
  మీ వ్యాఖ్య ఎక్కుడు హాస్యాన్ని పండిస్తోంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. 😁😁
  శ్రీమతి గారికి చూపించను అంటున్నారు మీది బట్టతలా ఏమిటి, లక్కరాజు వారూ? 😁😁?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అయ్యా విన్నకోట వారూ అల్లా ప్రశ్నిస్తే కష్టమే. నేను సత్య సంధుణ్ణి. చెప్పక తప్పదు.జుట్టు లేని వాడ్నిఎల్లా పెళ్లి చేసుకున్నానని అప్పుడప్పుడూ తాను లోలోపల అందరికీ వినపడేటట్లు అంటూ ఉంటుంది. పెళ్ళి నాటికి ఆవిడ జుట్టు వెన్నెముక పొడుగుండేది. అందుకనే ఆవిడని నాతో వచ్చేటప్పుడు కొప్పు పెట్టుకోమనే వాడిని. గుడ్డిలో మెల్ల జోడీ కొంచెం బాగుండేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఆడాళ్ళకే వస్తాయి మంచి మంచి ఐడియాలు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చిక్కు ప్రశ్న సారూ! అమ్మణ్ణీ ఏంచెప్పేదో :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఎక్కడుందొగాని , మొక్కు 🙏 లమ్మణ్ణికి ,
  లేని చిక్కుదెచ్చి లేపుగాని ,
  చిక్కు దీర్చుననెడు చింత యావంతయు
  తమకు వలదు సారు , తగదు తగదు .

  ప్రత్యుత్తరంతొలగించు