ఏ మనుభవించె కృష్ణయ్య , భూమి పైని ,
పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ
గొల్ల లిండ్లను బెరిగె , మేనెల్ల యాల
ధూళి దూసరితమయి దులకిసపడ .
మేనమామ శత్రువయి యేమేమొ చేసె
తనను చంపించ , తలిరాకు తనమునందె
గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని ,
యేరికైనను నిట్టి రాయిడులు గలవె !
ఆల గాచెను , మన్నుల రాల విపిన
తలములన్ , యెండ లనక , వాన లన కకట !
అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల
నిద్దురోయెను , ముద్దు మో మద్దె మురికి .
రాచపుటక బుట్టె , మధుర రస విరాజ
మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ
నమ్ము లేవి ? వెన్నలకు ప్రాణమ్ము లూన ,
గొల్ల లిండుల గోరాడె , గోస బడియె .
రాధతో గూడి , యమునా తటీ , ధరాది
తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ
జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ?
తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను .
కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి
ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు ,
పూని గాంధారి శపియించె , మునిగె నీట
ద్వారకాపురి యాదవుల్ పడిరి చచ్చి .
ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె ,
తాను పరమాత్మ యయ్యును , ధరణి పూని
ధర్మమును నిల్ప అవతారధారి యైన
కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము !
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
ముందే తెలిసినా తెలియక పోయినా జరిగేవి జరగకమానవు . కృష్ణయ్య మీద మీ పద్యం బాగుంది .
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్ ,
రిప్లయితొలగించండి