సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, డిసెంబర్ 2024, మంగళవారం

దేశమంటే .....

దేశమంటే

---------------

దేశమంటే మనుషులోయ్ 

అన్నాడు గురజాడ

 మనుషులందున్న నికృష్టుల

చెప్పగా మరచెన్


పూర్వ మెపుడో పుణ్యపురుషులు 

పుట్టినారట పూజనీయులు

నేడు పుట్టిరి నీతి బాహ్యులు

భూమి భారముగా


పుట్టి ప్రజాజీవిత మందు మనగా

పూని తహతహలాడు వారే

మంచి యన్నది మాయమైనది

రాజకీయములో


కోరి కూర్చుని తినుటె యెరిగిరి

కాయకష్టము సేయు వారలు

కరవు పుడమిని  వెగటు గల్గును

నేటి మనుషులలో


తేలికగ అనృతము లాడుటలె

మోసమును నమ్మి బతుకుటలే

ఎట్ల సంపాదించినది గా దెంత యన్నదె

మిన్నయందురు


దేశమంటే మట్టిగాదోయ్

దేశమంటే మనుషులోయ్

 పనికిరాని మనుషులోయ్

ఇంత ఘన దరిద్రులోయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి