సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణలు


పాత కాలపు టలవాట్లు పాడు చేయు

అంటరాని తనమ్ము వేశ్యాగమనము
బల ప్రయోగము సేత దుర్బలుల మీద
పూని మృగయా వినోదమ్ము మొదలు గాగ
పాత కాలపు టలవాట్లు పాడు చేయు

 విగ్రహములతో నిండెను వీధు లెల్ల

గ్రహము లాగ్రహించెను, దుష్ట గ్రహము లోలి
కదలి వచ్చెను,జనుల నిగ్రహము సడలె,
నాగ్రహము మీరి కలహించె నఖిల జగతి
విగ్రహములతో నిండెను వీధు లెల్ల  

 తాపసులకు రక్ష దైత్యతతులు

'పశుధర్మాచరణ'
దా పసయని మదిదలంచి తామస గుణులై
పాపము బోధించు నసుర
తాపసులకు రక్ష దైత్యతతులు దలంపన్ 

మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

ధీనిధు లై మహోన్నత సుధీ విభవమ్మున తెల్గు భారతిన్,
వాణిని తెల్గునాట జన వాడుక మాటలు కూర్చితెల్గులన్
జ్ఞాన ప్రసూన దాయినిగ, గ్రాంధిక కేవల తత్త్వగణ్యతా
మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

పూల పానుపు కాదది ముండ్ల బాట

చేల తలనేల,కనులు లోకాల నేల,
కేల తుల లేని సిరుల వరాలు దేల
గ్రాలు శ్రీసాయి కరుణాల వాల లీల
పూల పానుపు-కాదది ముండ్ల బాట

నామంబుల లోన పంగ నామము మేలౌ

ప్రేమ నటించుచు లోలో
నామంబులు దీయు సఖుని నమ్మకు నీవున్
ధీమమ్మున వాడి కిడుము
నామంబుల లోన పంగ నామము మేలౌ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి