సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణలు


మారు బూజింతు దైత్య సంహారు ధీరు

దేవ సేనాధి పతి మారె 'దేవ సేన '
పతిగ , కుండలినీ వళీ పతికి భార్య
'
వల్లి 'యయ్యె - విశాఖు,నపర్ణ మృడు కు
మారు బూజింతు దైత్య సంహారు ధీరు

 శివుని పూజింతు రేకా దశీ దినమున

శివుడు తనలోన లేనట్టి జీవి గలదె ?
సర్వ కాల సర్వా వస్థ పర్వ పూజి
తుండొక శివుండె ,వేద వేద్యులగు హరిని
శివుని పూజింతు రేకా దశీ దినమున

పంది మిగుల చొక్కె సుంద రాంగి

పార్వతి'యుమ ' తాను పరమేశ్వరుని కోరి
నిర్వి కారు డైన నిజ మెరింగి
ఘోర తపము జేసి కోర్కె తీరగ గెలు
పంది మిగుల చొక్కె సుంద రాంగి

పండితులను దిట్టు వారు పావన చరితుల్

మండిత సర్వజ్ఞుల వలె
దండి భ్రమల నెదుటి వారి తప్పులు వెదికే
చండాలపు రోగము గల
పండితులను దిట్టు వారు పావన చరితుల్  

ఆంగ్ల వత్సర మభయమ్ము నొసగు

తగిన వానలు పడి తనర పంటలు పండి
తిండి కలిగి ప్రజలు తిరుగు చుండ
తల్లి ప్రకృతి మాత చల్లని చూపు తో
నాంగ్ల వత్సర మభయమ్ము నొసగు

గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్
మతి దొలగంపుము, గతమే
గతకాలము ,మేలు వచ్చు కాలము ,కంటే(కంటెన్)!
మతిమంతుడు భువి నాశా
రతుడె, భవిష్యత్తు కోరి ప్రగతిని నడచున్








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి