ఆర్థిక-సామాజికాంశాలతో కూడిన సమ సమాజం ఏర్పడాలని
ఆశిద్దాం .
సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా
నియమావళి ఏర్పడాలని ఆశిద్దాం .
ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను
నివారించి క్రమశిక్షణ పాటించాలని ఆశిద్దాం .
విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడాలని
ఆశిద్దాం .
పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే
రోజు రావాలని ఆశిద్దాం .
లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తుందని
ఆశిద్దాం .
మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రావాలని ఆశిద్దాం
.
పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం రావాలని
ఆశిద్దాం .
మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే
సంస్కృతి అలవడాలని ఆశిద్దాం .
స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత
సమాజం ఏర్పడాలని ఆశిద్దాం .
ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం
ఏర్పడాలని ఆశిద్దాం .
రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోవాలని
ఆశిద్దాం .
అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ
మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తుందని ఆశిద్దాం .
రచయితలూ,కవులూ,కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి
అవసరమైన చైతన్యస్ఫూర్తినందిస్తారని ఆశిద్దాం .
మేలైన సమాజం కోసం
మెరుగైన జీవనం కోసం
కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం
శుభాకాంక్షల నందిద్దాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి