జయ మంగళ శుభ కరునికి
జయతు జయతు నిఖిల లోక జగదీశునకున్
జయ పావన శుభ చరితుకు
జయతు జయతు సాయి నాధు చరణ యుగళికిన్
జయ రంజిత నామమునకు
జయతు జయతు సాయి రాము సర్వజ్ఞు నకున్
జయ జగతీ జన వరదుకు
జయతు జయతు కరుణామయు చరణ యుగళికిన్
జయ సర్వాంతర్యామికి
జయతు జయతు సర్వ కార్య జయ శీలునకున్
జయ విశ్వ జనావరుణికి
జయతు జయతు దేవ దేవు చరణ యుగళికిన్
జయ యోగీశ్వర వరునికి
జయతు జయతు సాయి కృష్ణ జనార్ధనునికిన్
జయ గీతా చార్యునికిని
జయతు జయతు పరమ గురుని చరణ యుగళికిన్
జయ జగదా ధారునికిని
జయతు జయతు జంగమ పతి సాయి శివునికిన్
జయ దీన జనావనునికి
జయతు జయతు లోక ప్రభు చరణ యుగళికిన్
జయ బ్రహ్మార్చిత మూర్తికి
జయతు జయతు దత్త సాయి జ్ఞా నాంభసికిన్
జయ చిన్మయ సందీప్తికి
జయతు జయతు పరమ పురుషు చరణ యుగళికిన్
జయ సర్వ వ్యాపనునికి
జయతు జయతు సాయి విష్ణు జలజేక్షణుకున్
జయ నారాయణ విభునికి
జయతు జయతు వేద వేద్యు చరణ యుగళికిన్
జయ నిత్య పరం జ్యోతికి
జయతి జయతు సర్వ సిధ్ధి సంభావ్యు నకున్
జయ ఘన సాయి ప్రభునికి
జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్
జయతు, జయతు, బాగా రాశారు
రిప్లయితొలగించండిధన్యవాదములు
తొలగించండిసర్, మీకు నా కవితాసంకలనం పంపాలి. మీ చిరునామా, లేదా నంబరు ఇవ్వగలరు, ఇది నా అభ్యర్దన
రిప్లయితొలగించండిMail ID : vrrlakkakula@gmail.com
తొలగించండిసాహితీ మిత్రులు రాజారావుగారికి నమస్కారములు! తమరి సాయీ స్తోత్రము చాల బాగుగ నున్నది. అభినందనములు.
రిప్లయితొలగించండిజయ షిరిడీ సాయీశా!
జయతు జయతు సకల సుజన సంతోషకరా!
జయ దీనజనార్త్యపహా!
జయతు జయతు సౌఖ్యదాయి! జయ యోగీంద్రా!
మిత్రులు మధుసూదన్ గారికి
రిప్లయితొలగించండిధన్యవాదములు .