మానవుని దృష్టి పరిమితం .
మానవుని మేథస్సు పరిమితం .
మానవుని శక్తి పరిమితం .
మానవుని జీవితం పరిమితం .
అందుకే తన శక్తి
కంటే అపరిమిత శక్తి వైపు ఊహ మొదలైంది .
ఊహ నుండి శోథన మొదలైంది .
ఫలితంగా భగవద్భావన మొదలైంది .
తన కంటే శక్తి సంపన్నులైన లోకోత్తర పురుషుల ఆరాథన
మొదలైంది .
ఈ భూమి పై జన్మించిన ఆ లోకోత్తరులే-
మానవ జాతి నుథ్థరించిన మహాను భావులైనందున –
వారే భగవంతుని ప్రతిరూపాలుగా భావింప బడినారు .
వారి లోకోత్తర జీవితాలు పరిసమాప్తమైనా –
వారి నామ సంకీర్తనల , పూజనల , ఆరాథనల ద్వారా –
తమ జీవితాలు సాఫీగా సాగుతా యనే అపరిమిత విశ్వాసం
ఏర్పడింది .
ప్రబలమైన ఈనమ్మకం వల్లనే –
లోకోత్తర పురుషులంతా లోకారాథ్యులైనారు .
మతమేదైనా మహిమాన్వితులైనారు .
వారు చూపిన త్రోవలు జీవన మార్గాలైనవి .
సత్యం , థర్మం , ప్రేమ , దయ , అహింస , పరోపకారం –
అన్ని మతాలలో ప్రతిపాదింప బడి –
సందేశాలై మానవాళికి సర్వదా ఆచరణీయాంశాలైనవి .
వివిథ దేశాలలో , వివిథ కాలాలలో అవతరించి –
మానవాళి మనుగడకు దిశా నిర్దేశం చేసి , ఉథ్థరించిన
–
జీసస్ , మహమ్మదు , కృష్ణుడు , రాముడు , బుథ్థుడు , శిరిడి సాయి
మొదలైన
లోకోత్తరులు సర్వదా లోకారాధ్యులు .
వారి జయంతులు మానవాళికందరికీ పర్వదినాలు .
వారి జయంతులు మానవాళికందరికీ పర్వదినాలు .
ఆయా దినాలలో
ఆయా మతస్థులు ఆనందంగా –
పండుగ సంబరాలు జరుపు కుంటున్నారు .
ఐతే ,
లోకోత్తర పురుషులంతా –
మతాతీతంగా –
మానవ జాతి కంతటికీ ఆరాథ్యులు .
మానవ జాతి నుథ్థరించిన మహాను భావులందరి యెడల –
కృతజ్ఞతలు తెలుపు కుందాం .
ప్రతి మహానుభావుని జయంతినీ స్మరించు కుందాం .
లోకారాథ్యు లందరికీ ప్రణామా లర్పిద్దాం .
మానవులంతా ఒకటేనని చాటుదాం .
కుల , మత , దేశ , కాల – సంకుచిత తత్త్వాలతో
జాతి సమైక్యతను నిర్వీర్యం చేయడానికి
ఎత్తుగడలు రచించే మహానుభావుల యెడల
అప్రమత్తులమౌదాం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి