భక్తికి నిలయమై పరిఢవిల్లిన భూమి
జ్ఞానాగ్ని రగిలిన కర్మ భూమి
గురు బోధనామృత ఝరులు పారిన భూమి
తత్త్వ వేత్తల యరుదైన భూమి
పరమ హంసల దివ్య పాదముద్రల భూమి
పావన నదుల సంపదల భూమి
వివిధ సంస్కృతులతో వెల్గులీనెడు భూమి
భిన్న మతాల సంపన్న భూమి
అట్టి భారత భూమిపై పుట్టిన ఘను
లెందరో కలరు , వారిలో మంది కొఱకు
బ్రతికి మార్గ దర్శకుడైన పరమ గురుడు
సాయి నాధ్ మహా రాజుకు జయము జయము
ముక్కోటి దేవతల్
భూదేవతల చేత
బందియై చీకటి మందిరాల
వెల వెల బోవగా వెలసె సాయిగ సర్వ
దేవతా సత్తాక దివ్య మూర్తి
ముక్కోటి దైవాల కొక్కటే రూపమై
అరుదైన దైవమై యవతరించె
సాయి కృష్ణా యన్న, సాయి రామా యన్న
సాయీశ్వరా యన్న కాయు ప్రభుడు
సాయి రారా యని పిలువ చేయి సాచి
అందుకొని అండగా నిల్చు నతడు గాక
ఇంక వేరెవ్వరయ్య ధ్యానించి కొలువ
సర్వమూ సాయి మయము విశ్వాసమున్న
తర తమ భేదాలు తారసిల్ల వచట
తరియింతు రతని పాదాలు తాకి
కుల మత భేదాల కుమ్ములాటలు లేవు
ప్రణుతింతు రతని హారతులు పాడి
ఆగమ శాస్త్రాల అడ్డు గోడలు లేవు
పరవసింతు రతని భక్తి యందు
ఆదరించుటె కాని చీదరింపులు లేవు
అరుదేర నతని మందిరము లందు
అతడె శ్రీ సాయి ప్రభు డరుదైన గురువు
తాకి తలిచేటి దైవమ్ము దరికి గాక
‘ తొలుగు దూరము దూర ‘మంచలుగు
వారి
పంచ చేరంగ వెఱ్ఱులా ప్రజలు నేడు .
Adbhutam! Jai Sairam!
రిప్లయితొలగించండితరంగిని గారూ ,
తొలగించండిధన్యవాదములు . శ్రీ సాయినాధుని కరుణా కటాక్షాలు అందరిపై ప్రసరించి సకల సౌభాగ్యములు బడయుదురు గాక !