పద్యము లన్న నాంధ్రులకు ప్రాణము ,
పద్యము తెల్గువారి వై
విధ్య వచో విధాయక ప్రవృత్తి , నిరక్షర కుక్షియైన తా
పద్యము జెప్పిగాని తన పల్కు ముగించడు , తెల్గు నేలకున్
పద్యముకున్ గలట్టి యనుబంధము లిట్టివి , చూడ
ముచ్చటౌ .
మూటలు గట్టి పద్యముల ప్రోవులు వోసిరి - పల్లెటూళ్ళ
ఆ
తేటల తెల్గు మాటలను - తిక్కన పోతన వేమనాదు లా
మాటలు నేటికిన్ గడు సమాదరణీయములై తెలుంగులో
పాటల యందు పద్యముల పట్టుల వాడుట జూడమే యిటన్ .
చదువుట తోనె భావములు చప్పున దోచగ – పద్యమాలికన్
బొదిగిన రామణీయకపు పొల్పులు దెల్పగ తల్లి భాషకే
చదురులు గల్గు గాన - సహజమ్మగు తెల్గు పదాల సొంపులన్
మదికి లయించి వ్రాయు గరిమల్ గల పద్యము లింపు
గూర్చెడిన్ .
పద్యమందు , పల్లె పట్టులందు , అచటి
మనుజులందు , వారి మాటలందు ,
అందు తేనెలూరు ఆప్యాయతల తెల్గు
దనములందు తియ్యదనము కలదు .
పట్టణ వాసనలంటని
మట్టిన్ మన పలుకుబళ్ళు మనుచున్నవి – ఆ
పుట్టతెనుగు తేనె పలుకు
పట్టి పిడిచి పద్యమందు వాడగ వలయున్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి