తెలుగు వలె తియ్యనిది
వెలుగు వలె జిలుగైనది
తెలుపు వలె స్వఛ్ఛమైనది
నలుపు వలె నమ్మకమైనది
చెలువము వలె దరి చేర్చేది
వలపు వలె వదిలి పోనిది
కలువ వలె కన్ను గీటేది
కొలను వలె కలలు పూచేది
పలుకు వలె ప్రేమ చిలుకరించేది
పిలుపు వలె ప్రియమైనది
పులుపు వలె ఊరించేది
ఉలుకు వలె ఉడికించేది
చెలియ వలె వెచ్చనిది
చెలిమ వలె చల్లనిది
అలుపు వలె సొలపనిది
సొలుపు వలె సలపనిది
కొలువు వలె విలువైనది
నెలవు వలె సుళువైనది
మొలక వలె మోసు లెత్తేది
తలపు వలె తరగనిది
కలిమి వలె కన్నుమొరగనిది
కలకాలం కలిసుండేది
ఇంకేమున్నది
ఒక్క స్నేహం తప్ప
స్నేహ శీలురైన
తెలుగు బ్లాగర్లందరికీ
చెలిమి దివసాన
సుజన-సృజన
స్నేహాంజలులు .
very nice,wish you happy friendship day!
రిప్లయితొలగించండిThAnks Sir ,
రిప్లయితొలగించండిమీ ప్రతి పిలుపూ...పలుకూ గొప్పవే సర్,
రిప్లయితొలగించండిThanks Meraj gAru ,
రిప్లయితొలగించండి