కృష్ణ రారా
చిన్ని కృష్ణ రారా
ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా
ఆరగించి వరములిచ్చి ఆదుకోరా
స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి
కృష్ణా || కృష్ణ
రారా ||
తర తరాల తల్లి ప్రేమ త్రచ్చి వెన్న తినిపించెను
మమకారపు పిచ్చి ప్రేమ కుమ్మరించి యశోదమ్మ || కృష్ణ
రారా ||
అనురాగపు ప్రేమ వెన్న పెన వేయుచు తిని పించెను
మనసున తనువున తానై అణువణువున రాధమ్మ || కృష్ణ రారా ||
తరగని ప్రేమల వెన్నలు తరచి తరచి తినిపించిరి
తమను తాము అర్పించుచు తరుణులు గోపిక రమణులు || కృష్ణ రారా ||
అడుగడుగున నడయాడుచు ఆడి పాడి చెలిమి వెన్న
వనమున యమునా వనమున తినిపించిరి గోపాలురు || కృష్ణ రారా ||
తెలుగుల తేనియలద్దిన పద్య సుధల భాగ్యనిధులు
భాగవతపు భక్తి వెన్న తినిపించెను పోతన్న || కృష్ణ రారా ||
ఆనందో బ్రహ్మ
రిప్లయితొలగించండిSarma gAru , dhanyavadamulu .
రిప్లయితొలగించండిఅధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ |
రిప్లయితొలగించండిహృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ||
స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి కృష్ణా //
చాలా చక్కటి చిక్కటి మధురమైన బావన మాస్టర్ గారు.
మధురంగా ఉంది మీ వ్యాఖ్య కూడా భారతిగారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .