సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

మన జాతి తెలుగు జాతి

నానేల తెలుగు నేల
నాజాతి తెలుగు జాతి
నాభాష తెలుగు భాష
నన్నందరూ తెలుగు వాడంటారు
అరవలూ , కన్నడిగులూ ,
కళింగులూ , మరాఠాలూ-అందరూ
నన్నందరూ తెలుగువాడంటారు .

కానీ ,
మనలో మనం మాత్రం
ఆంధ్రోడనీ
తెలంగాణావాడనీ
రాయలసీమోడనీ పిలుచుకుంటాం
ఐనా ,
ఇదేమీ అసహజం కాదు గదా
ఒకే జాతిలో
ప్రాంతీయ భేదాలూ
ప్రాంతీయ మాండలికాలూ
ప్రాంతీయ యాసలూ కూడా సహజమే
పాలనా పరంగా
రాష్ట్రాలు రెండైనా , మూడైనా
ఈనేల తెలుగు నేల
ఈజాతి తెలుగు జాతి
ఈభాష తెలుగు భాష

సంస్కృతంతో జత కట్టి
మణులూ పగడాల సరమైనా
ఉర్దూతో జత కట్టి
ముత్యాలూ పగడాల సరమైనా
మనభాష తెలుగు భాష

బతుకమ్మలాడుతూ
ప్రకృతి మాత నారాధించినా
సంక్రాంతి సంబరాలతో
పాడి పంటల నారాధించినా
మన నేల తెలుగు నేల

ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టడం
విద్వేషాలు రగిలించడం
ఎలక్షన్ల పబ్బం గడుపుకొవడం
పాలకులు కావడం
నేతల రాజనీతి
నేటి రాజనీతిజ్ఞులెవ్వరూ
సామాన్య జనం కోసం కాదన్న నిజం
చరిత్ర చెప్పిన సత్యం

మాయగాళ్ళ మాటల్ని పక్కన పెడితే
మన నేల తెలుగు నేల
మన జాతి తెలుగు జాతి
మన భాష తెలుగు భాష  






4 కామెంట్‌లు:

  1. రాజకీయుల వలలో పడి సామాన్యులు కూడా ఎదుటివారిని కించ పరుస్తూ గోదారి జిల్లావాడివా దొంగ నా... అని మాటాడు తున్నారు. వీరినేమనాలి?

    రిప్లయితొలగించండి
  2. ఒక భాష మాట్లాడే వాళ్ళు అందరూ ఒక జాతి కానక్కరలేదు. మీదీ మా జాతే అని ఎవరినీ బలవంతంగా కలుపుకోలేరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాష అని ఒకే జాతిలో కలుపుకోవటం, పెద్ద జోకు. ఇక్కడ [మాట్లాడుతున్నారు కాబట్టి మనుషులే] అనుకోవటమే మానేసాం అనవసరంగా కంగారుపడమాకు.

      తొలగించండి
    2. ఇక్కడ మాట్లాడుతుంది తెలుగు జాతి గురించి కాని, తెలబాన్ జాతి గురించి కాదు, కంగారు పడబాక్ ఏడుపుముక్కల.

      తొలగించండి