సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, అక్టోబర్ 2015, శుక్రవారం

ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు !


సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడి , నడుచుకో గలిగితే ,

ఆర్థిక-సామాజికాంశాలో  సమ సమాజం ఏర్పడితే , 

ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించ గలిగితే ,

విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడే రోజొస్తే ,

పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజొస్తే ,

లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తే , 

మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రూపొందితే , 

పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం వస్తే , 

మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడితే ,

స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడితే ,

ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడితే , 

రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతే , 

అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తే ,

రచయితలూ, కవులూ, కళాకారులూ సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందించ గలిగితే ,

మెరుగైన జీవనం కోసం

మేలైన సమాజం ఏర్పడితే ...... ,
ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు !

 

 

2 కామెంట్‌లు:

  1. సృజనశీలురైన సుజనులు కోరుకుంటే సాధించలేనిది ఏమీ లేదు.ఆ రోజుకోసమే నా ఎదురీత !

    రిప్లయితొలగించండి
  2. ఈ దేశాన్ని సర్వ నాశనం చేసిన వాళ్లు మేధావులే మేడం . కాయకష్టం అంటే గౌరవం లేని దుర్మార్గం ,
    మేధస్సును కష్ట జీవుల కష్టాన్ని దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించే నీచత్వం , కష్ట పడకుండా సౌఖ్యాన్ని అనుభవించే హింసానందం .... ఇంకా అనేకానేకం ఈ దేశపు మేధావుల వంశపారంపర్య లక్షణాలు . జ్యోతిష్య , హస్తసాముద్రిక , కార్తాంతిక , ప్రాశ్నిక , పాంచాంగ , పౌరోహిత్య , యజ్ఞ యాగాదిక , మంత్ర తంత్రా ల లాంటి అనేకానేక సామాజిక రుగ్మతలను రుద్ది , బ్రమలలో ముంచి , సమాజాన్ని ఇంక కొన్ని సహస్రాబ్దుల వరకూ బ్రమలు తొలగనంత గట్టి పునాదులపై బ్రతుకుతున్నారు . వీరికితోడు సరికొత్త ప్రజాసేవకులు బయలు దేరి విద్య , వైద్బం మొదలు నీరు గాలి వరకూ వ్యాపారమయం చేసి తరిస్తున్నారు . వీళ్లేమీ ప్రకృతి కతీతులు కాదు . మృత్యు గహ్వరం లోకి వెళ్ళక తప్పదు కదా ! మరి ఎందుకీ అపసవ్య మేథో జారత్వాలు ? అడుగడుగున బ్రమలలో బ్రతుకీడ్చే జాతికి సవ్యజీవనంపై గురి కుదురు తుందా ?
    అందుకే ....
    మెరుగైన జీవనం కోసం
    మేలైన సమాజం ఏర్పడితే ....
    ఆరోజొస్తే ....... ఎంత బాగుణ్ణు !

    రిప్లయితొలగించండి