మా కుల్లూరు
***********
మా కుల్లూరు పురాధి దేవత సదా మాక్షేమ ముల్గోరుచున్
రాకాచంద్ర మనోఙ్ఞ ధీధితులతో రాజిల్లు పోలేరు తా
పోకార్చున్ కడ గండ్లు రోగములు రేపున్ మాపు మా యూరికిన్
చేకూర్చున్ మహనీయ శోభనములన్ చెన్నొంద రక్షించుచున్ .
ఉత్తరాన పెన్న , ఊరికి పడమట
చెరువు , చెరువు వెనుక ధరణి ధరము ,
దక్షిణాన చేలు , దర్శింప దూరాన
పెనుశిలేశు డుండు పెన్నిధి వలె .
నాల్గు దిశల బలము నైసర్గి కమ్ముగా
కలిసి వచ్చి వాస్తు ఘనత దాల్చి
చదువులందు సిరులు సంపదలందున
చుట్టు పట్ల ప్రజల స్తుతులు బొందె .
సువిశాలమైన వీథులు
నవవిథ కులాలవాళ్ళు నవ్యత లొలుకన్
ప్రవిమల ప్రశాంత ప్రకృతిని
రవి కిరణము వోలె వెల్గు రాజస ఠీవిన్ .
పెన్న ఒడ్డునున్న మీ కుల్లూరు పక్కనే తెలుగురాయపురం వుందట కదా - భలే భలే - తెలుగు మాస్టారూ!
రిప్లయితొలగించండిఅవును , మీకు తెలుసా ? నేనూ తెలిసినట్లేనా ?
రిప్లయితొలగించండిమా మామయ్య తెలుగురాయపురం స్కూలు HM గా
ఉండేవారు . ధన్యవాదములు .
మీరు నాకు తెలుసండి - బ్లాగుల్లో - మహ బాగా! కుల్లూరు ఎక్కడుందా అని గూగుల్నడిగితే పక్కనే చూపించిన తెలుగురాయపురం పేరు చూసి "అబ్బో - మా తెలుగు మాస్టారికి తగిన పొరుగు" అనుకున్నాను అంతే!
తొలగించండి