21, మార్చి 2017, మంగళవారం
ఇది వసంత హేల .....
భూమీ తలమును రంగుల
ఆమని ముంచెత్తె , చివురుటాకులెరుపులో
పామిన శ్యామలమయ్యెను ,
ఏమని వర్ణించ వచ్చు నీ వని యమునన్ .
నిండుగా పూచి పొగడ వన్నియలు వోవ
దరిసి నాధుని కైసేయ దండ గ్రుచ్చి
మురిసి రాధిక మాధవుముందు నిల్చి
గుండెలకు గుండెలానించి దండ గూర్చె .
మోదుగ పూగుత్తిని గన
మాధవునికి రాధమీద మనసు దవిలి , బిం
బాధరి మోవికి వంశీ
మాధుర్యపు కేళి పంచి మరులొలికించెన్ .
బృందావనమున గోపీ
బృందముతో కృష్ణు డాడె , బింబాధరులున్
బందీలై మాధవునికి
సంధించిరి సరస మధుర సరి సమరమ్ముల్ .
ఇది వసంత హేల , యిల కెన్నిరంగులో
ప్రకృతి కన్య పూచి పరవశించె ,
ఇందు బ్రతుకు మనిషి కెందుకో ప్రకృతితో
పాలు పంచు కొనుట పడుట లేదు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సీతారామశాస్త్రిగారి "ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో - పదము కదిపితే ఎన్నెన్ని లయలో" పాటని గుర్తుచేసింది మీ ఈ పద్యమాల.
రిప్లయితొలగించండిలలిత గారిటు వచ్చిరి , లలిత లలిత
తొలగించండివ్యాఖ్య బెట్టిరి , కడు ధన్యవాద మమ్మ !
రాథికా శ్యాము డెంతటి రస హృదయుడు !
వంశి మోహన రాగాల వరద పారె ,
మీరు రాసే ప్రతీ పదం
రిప్లయితొలగించండిరసరమ్య సుమధురం..
చదివి పరవశించడమే తప్ప
వ్యాఖ్యలిడలేను..
ఇది నా చేతకాని తనం
అప్పు డెప్పుడో ఒకపరి , అదియు నొక్క
తొలగించండిసారి ! మా సుజన సృజన పార జూచి
నట్లు గుర్తు పద్మార్పిత , అహహ ! నేడు
వ్యాఖ్య రాసిరి గూడాను , వాహ్ ! భలేగ .