సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, మార్చి 2020, మంగళవారం

బతుకు వేసట


బతుకు వేసట కలవాటు పడి బ్రతుకుటె ,
మార్గ మింకోటి గలద యేమాత్రమైన ?
ఎందరో కష్టజీవను లుందు రిలను ,
జాలిపడ తప్పు ,  తలవంచి కేలు మొగుడు🙏

సృష్టి ధర్మము తెలియంగ కష్ట మిందు
ధర్మసూక్ష్మము వచియింత్రు కర్మ యనుచు
మర్మ మేముందొ గాని యీ కర్మకు బహు
జనులు బలియౌట వాస్తవ మని దలంతు .

ఆ పరాత్పరు డెంత దయామయుండొ
తేట తెల్ల మగుట లేద ! మాట మార్చి
మిధ్యయని సత్య మింకోటి మీకు జూపు
దనుట భావ్యమా కట్టెదుటను గనంగ .

నట్టి నడివీధిలో రాళ్ళు మోపెట్టి తలను ,
పసిది , ఇంకో పసి నిసుగు , బైట గట్టి ,
చంక బెట్టి బతుకు బాట సాగి చనుచు
మొలక నవ్వోటి విరియించు మోము గనగ .

కష్టమును చిరునవ్వుతో యిష్టపడుట
బాధ్యతను తలకెత్తుకు బతుకు టలును
ఎవరు నేర్పిరి , యీ యోర్పె యిల వెలయుచు
బతుకుటలు నేర్పె , యిదిగదా బతుకు ఘనత .

11 కామెంట్‌లు:

  1. ఎంత బాధ్యతను తలకెత్తుకోవడం అనుకున్నా కూడా ఆడకూతురు మరీ రోళ్ళను తలపై మోస్తూ వెళ్ళడమేమిటండీ బాబూ? ఎండ వేళ కూడానా? పైగా మీరన్నట్లు చిరునవ్వొకటి. నవ్వుమొహంతో చక్కగా కళగా ఉంది (ఇలా అనడానికి కూడా భయంగా ఉంది. ఎవరైనా అనానిమసుల వారు చూసి ఆయ్, ఒక స్త్రీ గురించి అలా మాట్లాడతావా ? నీ మీద ఫిర్యాదు చేస్తానుండు అంటారో ఏమిటో 😳?)

    చిన్నదైనా 🙏.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఫోటో షాపు ఫోటో కి ఇంత హంగామానాండి‌ రావుల్స్ గార్లు :)


      జిలేబి

      తొలగించండి
    2. మీరు సర్వజ్ఞులే గానీండి ఇది ఫొటోషాపు ఫొటో యని తమరెలా కనిపెట్టారు / అనుకుంటున్నారు?? కాస్త వివరిస్తే మేమూ నేర్చుకుంటాం కదా.

      తొలగించండి

    3. కొంత బుర్రెట్టి ఆ పెంకుల్ను చూడుడీ :)

      తొలగించండి
    4. చూచితిని, పట్టిపట్టి చూచితిని, గుచ్చిగుచ్చి చూచితిని. నా చిన్నప్పటి నుండీ తెలిసున్న పెంకుల వలెనే గోచరించుచున్నవి. పెంకులు రెండు రకములు. ఒకటి మామూలు పెంకులు, రెండవది బంగాళా పెంకులు. ఈ ఛాయాచిత్రములోని అమ్మి వెనకాల నున్న ఇంటిపై నేసినవి బంగాళా పెంకుల వలెనే అగుపించుచున్నవి.

      ఇదంతా కాదు గానీ మీరేమిటంటారు?

      తొలగించండి

    5. అనేదానికేమీ లే దండి చూచారు గాని బుర్రెట్ట లేదని తెలుస్తోంది :) వాటికి ప్రైవేటు బుర్ర కావాలండి జాతీయ బుర్ర సరిపోదు :)



      నారదా!
      జిలేబి

      తొలగించండి
    6. శ్రీ నరసింహరావు గారికి నమస్సులు , ధన్యవాదాలు .
      ఇహపోతే , ఇలాంటి వాళ్ళను నేను JNTU , నిజాంపేట
      ఏరియాలో చూచేను . ఇది వాళ్ళ వృత్తి . మగవాళ్ళు
      రాళ్ళు మలుస్తారు , ఆడవాళ్ళు తిరిగి అమ్ముకొస్తారు .
      ఒక్కోరాయి 150 నుండి 200 వరకూ అమ్ముతారు .
      నేనూ మా యింటికి కొన్నాను . మర , మీకెందు కిది
      అసహజంగా అనిపించిందో . కాకపోతే , ఎవరో సెల్లో
      ఫొటో తీసుకుంటా నంటే , తీసే టప్పుడు ఆవిడకి నవ్వొచ్చుంటుంది . ఇక , ముసుగు జిలేబీ వారికైతే ,
      నేను మా వూరి శివాలయంలో దైవారాధన చేసుకున్నప్పుడు కూడా వెటకారం చేసేరు . కొంత మంది
      తీరది . వారికి 🙏 . తమరు కూడా .....

      తొలగించండి
    7. “అసహజంగా “” తోచిందని అన్నది నేను కాదు మాస్టారూ. ఎవరు ఆ సంశయం లేవనెత్తారో పైన వ్యాఖ్యల్లోనే తేటతెల్లంగా ఉంది. నేనయితే మెచ్చుకున్నాను కదా।

      తొలగించండి
  2. సార్ , మీలో ఆ భావన లేదనే ఊహించాను .
    హైదరబాదు ఇలాంటి అనేక కుటుంబాలున్నవి .
    తమ వివరణకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  3. // “ వాటికి ప్రైవేటు బుర్ర కావాలండి జాతీయ బుర్ర సరిపోదు :)“ //

    అవునవును, గ్లామర్ చూపించి “ప్రైవేటు” బుర్రలు పట్టించే భ్రష్టుత్వాన్ని సరి జెయ్యడానికి “జాతీయ” బుర్రే గతి అని తేలిపోయిందిగా 😎.

    రిప్లయితొలగించండి