సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

కందానికి కూడ దురద .....



కందకు దురదందు , రరెరె !
కందానికి కూడ దురద గట్టిగ కలదా ?              
మందే లేదా ? మానుటె
మందా ? మరి కంద ప్రియుల మతులే మౌనో ?

శ్రీ ' సుసర్ల ' గారికి కృతఙ్ఞతలతో .....

7 కామెంట్‌లు:



  1. మందేస్కోనా రాజా
    కందంబేస్కో జిలేబి కారప్పూసల్
    చందంబై కిక్కిచ్చున్
    తందానా తాన తాన తందానానా :)


    నారదా
    కైలాసం‌ విశేషాలేమిటోయ్ :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వందారు🙏 , కంద దురదా
      క్రందన సుందర రదన సుగాత్ర విభూతీ !
      చిందర వందర బంధుర
      కందపు దురదలకు మందు గనము , విడుచుటే .

      తొలగించండి


  2. దురదంటే దురదాకా
    దు! రసజ్ఞులదోచు జిల పదునుగాంచు‌నిలన్
    వరుసలు వరుసలు గా మీ
    టరు తిరుగంగ పదములు పటపట పడంగన్!


    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి


  3. శివశివా!శివరాత్రి నాడు శివుని హాయిగా తలువక యిట్లా కంద దురద పై పడ్డారేటి రాజన్న గారు ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు, వచనంలో “జిలేబి” గారి వ్యాఖ్య ? దీన్నేనా జన్మానికో శివరాత్రి అంటారు?

      తొలగించండి


    2. మీ కోరిక కాదనాలెందులకు :)


      శివశివా!శివ రాత్రిని శివుని హాయి
      గా తలువక యిట్లా వడి కంద పద్య
      పు సడి యేలనో రాజన్న పుంగవులకు
      తామరసనేత్ర తోయలి తలిరుబోడి :)



      జిలేబి

      తొలగించండి
    3. పద్యమే కావాలని “కోరుకో”లేదు, వచనం చూసి ఆనందించాను, అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ పద్యం కట్టి నీళ్ళు జల్లారు మీరు. Very naughty.

      తొలగించండి