తన్వర్థభాగంబు తన్వికొసగి , భార్య
అర్థాంగి మనలోన యని తెలిపెను ,
నిరత నిశ్చల తత్త్వ నియమాన్ని పాటించి
కుదురుగా నుండుట కూడ నేర్పె ,
ఆనంద తాండవ మాడి , యాడుట నేర్పి
నందించుటే శక్తి కింధన మనె ,
తన జటా జూటంబు తగ భిగియగ గట్టి
బుధ్దిని తనువును ప్రోది బెట్టె ,
గళములో దాచు , నీలోని గరళ ముమిసి
లోకమును నాశ మొందించ బోకు మనెను ,
ఎన్ని నేర్పించె నీశ్వరు డీ జగతికి !
మాట వినకున్న , 'లయమె' ప్రామాణికమ్ము .
గరళకంఠుడు అంటే భలే భాష్యం చెప్పారు మాస్టారూ 👌.
రిప్లయితొలగించండిమీకున్నూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
🙏🙏🙏
తొలగించండికుదురుగమనస్సునిలుపగ
రిప్లయితొలగించండినుదుటన్ కన్నున్నవానినోర్పుగ గొలుతున్
ఎదుటను శివుడుండి నటుల
రిప్లయితొలగించండిపదపడి శ్రీ గాధిరాజు పరవశ మొందెన్ .
🙏🙏🙏
లక్కాకులవారిరచన
రిప్లయితొలగించండిముక్కంటినినాదుకళ్ళముందటనిలిపెన్
దక్కెన్ దర్శనభాగ్యము
మ్రొక్కన్ శివరాత్రిముందు మోక్షప్రదమై
🙏🙏🙏
తొలగించండి