కరుణయే రూపమై కన్పించు తాపసి
త్యాగమే దేహమై తిరుగు మౌని
దుఃఖంపు విరుగుడు దొరక బట్టిన దొర
సత్య మహింసల సంగ కాడు
సిధ్ధార్థుడన్ పేర జీర నన్వర్థమై
బుధ్ధుడై వెలిగిన బోధకుండు
గాలిలో దీపాల కరణి మతము లున్న
తరుణాన నిలిచె బౌధ్ద ప్రదాత
భరత మాతృ గర్భాన సంభవము చెంది
జగతి నేలిన దేవుడు శాక్యమౌని
ఏమిరా ! భారతీయుడ ! యే మదృష్ట
మిది ? మన మిచట బుట్ట , కామితము గాదె !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి