ముత్యాల జలతారు ముందుకు దిగజార్చి
తలమీద నెమలీక వెలయ నిలిపి
పీతాంబరము గట్టి ప్రియమార కటివస్త్ర
మును , పైన మొలనూలు మురియ దీర్చి
పచ్చని పటము పైపంచగా వైచి
పొగడ దండలు మెడను దిగ నొనర్చి
నుదిటిపై కస్తూరి నును తిలకము దిద్ది
మురిసి బుగ్గలపైన ముద్దు లిచ్చి
కూలి యాతల్లి నేలపై కొంత యలసి
ఎంత కైసేసినను నితడి కేదొ కొదువ
యౌ , నిదె ! మురళి , మరచితి , నను యశోద
దెంతదృష్టమొ కృష్ణ ! నీ దెంత కృపయొ !
👌👌
రిప్లయితొలగించండి“ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు”
🙏🙏🙏
తొలగించండి