ఇనుడు, విశ్రాంతి, వ్యాయామ, మెంచు తిండి,
ఆత్మవిశ్వాసము , హితులు నరయ మనకు
వైద్యు లార్గురు పుడమిపై వరలు చుండ్రు
చేరగా వెళ్ళు వారికి దూర మవకు .
1. సూర్యరస్మి
2 . విశ్రాంతి
3 . వ్యాయామము
4 . ఎంచుకునే ఆహారము
5 . ఆత్మవిశ్వాసము
6 . స్నేహితులు
ఈ ఆర్గురూ మన ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించే
డాక్డర్లు . భగవంతుడు ప్రసాదించిన ఈ ఆరుగురికి సమీపంలో ఉన్నావంటే
నీవు జబ్బుపడవు .
బాగా చెప్పారు, మాస్టారు. అందరూ .. ముఖ్యంగా .. వయోవృద్ధులు తప్పక పాటించాలి. ఇటువంటి సహజ “డాక్టర్లను” నమ్ముకుంటే హాస్పిటళ్లతో పనేమిటి?
రిప్లయితొలగించండిమీ విషయానికి వస్తే మొదటి మూడు మీకు పుష్కలంగా దొరుకుతుండుండాలి. మీ ఇంటి నుండి అమ్మవారి గుడికి నడిచి వెళ్ళి, తిరిగి వెనక్కు నడిచి రావడం వలన వ్యాయామం బాగానే అవుతుంది కదా. బయటకు వెడతారు కాబట్టి సూర్యరశ్మి తగులుతుంది .... అపార్ట్నెంట్లలో జీవితం కాకుండా.
4, 6 విషయంలో మీరు జాగ్రత్తగానే ఉండుంటారు. అన్ని సంవత్సరాలు సేవ చేసి విశ్రాంత జీవనం గడుపుతూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మీ ఆత్మవిశ్వాసం గట్టిగానే ఉందన్నమాట.
పై విడియో చూశాను, కంటికింపుగా ఉంది. మీ గుడి దగ్గర మీరు వేసి, పెంచుతున్న తోట కదా, మాస్టారూ? ఆ మొక్కల పాలన మొదటి నుండీ మీరు అంత శ్రద్ధగా చేశారు కాబట్టి ఏపుగా పెరిగాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తోంది 👏.
పెద్దలు శ్రీనరసింహరావుగారికి నమస్సులు .
తొలగించండిమన హితైషులు శ్రీ బండి నాగమల్లీశ్వర దొర
వరులు ఈ శుభోదయాన నా వాట్స్ యాప్ లో
ఒక వీడియో పెట్టేరు . అందులో ఆర్గురు డాక్టర్ల
అంశం నాకు నచ్చింది . దాన్ని పద్యంలోకి తర్జుమా
చేసి షేర్ చేశాను . తమ సాదర వాక్యాలకు ధన్య
వాదాలు .