సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, మార్చి 2022, మంగళవారం

మహిళ 'మహరాణి' నేటి రామాయణమున

 బధ్ధకముగ లేచి , పడకపై కసిరిన ,

సతికి నెస్ కాఫి చేసాచి యొసగి ,

బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,

స్నానాదికముల వేసట ముగించి ,

వంట జేసి , పొసగ  వడ్డించి బాక్సులన్ ,

పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,

సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,

మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,


చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,

అచటనూ తిట్లతో చంపు ఆడబాసు

వద్దురా మోడరన్ మగవాళ్ళ వెతలు

మహిళ 'మహరాణి' నేటి రామాయణమున .


( మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )

2 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హ, కరక్ట్ గా చెప్పారు
    ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయారేమిటి, మాస్టారూ?

    రిప్లయితొలగించండి
  2. సార్ ,
    మరేం కారణం లేదండీ . ఇటు రావడం లేదంతే .
    ధన్యవాదాలూ , నమస్సులున్నూ .

    రిప్లయితొలగించండి