విజయోస్తు గణనాధ ! విఘ్నేశ ! సురవంద్య !
విజయోస్తు శివుడ ! దిగ్విజయమస్తు ,
విజయోస్తు కుల్లూర వెలసిన పోలేరు !
విజయోస్తు రామ ! దిగ్విజయమస్తు ,
విజయోస్తు అచ్యుతా ! విశ్వ జన వినుతా !
విజయోస్తు హనుమ ! దిగ్విజయమస్తు ,
విజయోస్తు వెంకయ్య ! వినుతింతు , వినుతింతు
విజయోస్తు సాయి ! దిగ్విజయమస్తు ,
దిగ్విజయమగు గాక ! మా దివ్య , మాతృ
భువికి , అచటి ప్రజలకు , ఈ పుడమి వెలయు
సకల జనులకు , విజయదశమి యొసంగు
సకల సన్మంగళములు , ప్రశాంతతలును .
గొలగమూడి వెంకయ్య స్వామి గారిని, మీ కుల్లూరు పోలేరమ్మ గారిని కూడా కలిపి పైన మీరు వ్రాసిన విజయగీతం బాగుందండి మాస్టారు 🙏. మీకు, మీ పరివారానికీ విజయదశమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసార్ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .
అమ్మవారి ఆలయం పునర్ణిర్మాణం పనులు జరుగు
తున్నవని తెలియజేయడం ఆనందంగా ఉంది .
ఆశీస్సులందించండి .