సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, మే 2022, శనివారం

మిత్ర సమాగమం


 

బండి కాపు దొరను నిండుగా గాంచితి

విజయవాడ లోన వేడుక పడి

స్నేహ  భాషణాలు చేసిన విందులు

మధురమై తనిసెను మది మరిమరి .

4 కామెంట్‌లు:

 1. "కాపుదొరల" భేటీ అన్నమాట 🙂? ఏమైతేనేం, మిత్రులను కలుసుకోవడం ఎప్పుడూ ఆనందదాయకమే కదా.

  ఇద్దరి మొహాల్లోనూ మార్పు గోచరిస్తోంది - నేను చూసి చాలా కాలం అవడం మూలాన అయ్యుటుంది.

  రిప్లయితొలగించు
 2. పెద్దలు నరసింహరావుగారికి నమస్సులు .
  కాలంతోటి మార్పుసార్ , బండి సారు మాంచి అందగాడు .
  నేనైతే సాదాసీదా . నిన్న మా బంధువుల వివాహ వేడుక
  విజయవాడలో జరిగింది . చూడాలనిపించి సారుకు కాల్
  చేశాను .

  రిప్లయితొలగించు
 3. మంచి పని చేశారు.
  కొన్నేళ్ళ క్రితం నేను కూడా ఇలాగే ఏదో పని మీద విజయవాడ వెళ్ళడం జరిగింది. బండి వారికి ఫోన్ చేసి చెప్పాను. వెంటనే తనే మా బస వద్దకు స్వయంగా వచ్చి కలుసుకున్నారు. కాసేపు కాలక్షేపం చేశాం.
  అందగాడే కాదు, బండి వారు స్నేహశీలి.

  రిప్లయితొలగించు
 4. ముందుగా మీ ఇరువురి సుహృద్భావానికి, మంచి మాటలకు వినమ్ర వందనం.

  ఈ బ్లాగ్ మాధ్యమం ద్వారా నాకొనగూడిన విశేష ప్రయోజన మేమిటంటే, నేను కూడా ఇంతో అంతో వ్రాయగలనని నన్ను నేను తెలుసుకోగలగడం ఒక ఎత్తైతే, ముచ్చటగా, మూన్నాళ్ళ ముచ్చట కాని, అచ్చు త్రిమూర్తుల వంటి, ముగ్గురు అచ్చు/అచ్చ మిత్రులు (శర్మ గారు, రాజారావు గారు, నరసింహా రావు గారు) దొరకడం నా రాత ఫలం. "దొరకునా ఇటువంటి వారూ ...
  కృతజ్ఞతలు, మువ్వురికీ ...

  రిప్లయితొలగించు