'తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు'
పండితులను గూర్చి పద్య మిదియ ?
అన్ని తమకె దెలియునన్న యహంకార
మసలు విడరు వేమ! సిసలు మాట .
పండితులను గూర్చి పద్య మిదియ ?
అన్ని తమకె దెలియునన్న యహంకార
మసలు విడరు వేమ! సిసలు మాట .
పిడికెడు మంది
ప్రబుధ్ధులు
పడి పడి తలలూచు
కొఱక పద్యపుశోభల్ ?
నడయాడ వలద , తెలుగుల
నడివీధుల , నాల్గుదెసల నాట్యపు హేలల్ .
సాంప్రదాయ బధ్ధ
సద్గుణ సంపన్న
బ్లాగు తనదటంచు
పలికి , యొకడు
తెలుగు గ్రామీణుల
తేట పదాలున్న
పద్యము ప్రకటించ వద్దనియెను .
తనది తులసి వనము , తాకరాదనెనొక్క
యాచకుండు , భజన మేచకుండు
వారు వీరు జేరి
వర్థిల్ల జేతురా ?
స్వార్థపరులు
తెలుగుభాష నకట !
మహితాత్ములు
పూర్వకవులు
మహనీయ గుణాలవాల
మాన్యులు , వీరో ?
బహు నీచ మనో లాలస
మహితాత్ములు
విడువరెపుడు మాలిన్యములన్ .
కోమల జల
స్రోతస్విని
గ్రామీణ తెలుంగు , సదరు లలిత పదాలన్
ధీమమ్మున
వెలయించిరి
వేమన్నయు అన్నమయ్య
వేడుక కల్గన్ .
రిప్లయితొలగించండిశభాష్ !
వేమన పరంపర నిచట
మా మనవలకును తెలుపగ మాస్టారు గనన్
జామున రాజన్న పలుకు
గా మనకు కవిత లలరుట గాంచితి నిచటన్
చీర్స్
జిలేబి
పోవమ్మా! 'మీరంతా'
రిప్లయితొలగించండిభావింపగ 'తులసివనపు' పండిత శ్రేణిన్ ,
జీవింతు రనృతపు దెస ,
'పావన'మగు తెలుగు , 'భజన' వలన జిలేబీ !
ఎవరిని పొగుడుతున్నారండీ ?
రిప్లయితొలగించండితులసివనాలను మరియున్
తొలగించండితులసివనాలందు ముదముతో జేరు మహా
తెలుగుశ్రీలను 'పొగడగ
వలయు' గదా! లేనియెడల వచ్చును కష్టాల్ .
తొలగించండిపోవయ్యా రాజన్నా !
మీవలె వ్రాయన్ జిలేబి మీగడ తినగ
న్నీ వయసున రాదుగదా
జావళి రాగము జిలేబి చప్పుడు గానన్ :)
bagunnayi
రిప్లయితొలగించండిధన్యవాదములు .
రిప్లయితొలగించండి