చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే , మామ్
దట్స్ గుడ్
****************
హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
****************
హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్ ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
****************
భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .
రిప్లయితొలగించండిహౌ క్యూట్ టపా :)
జిలేబి
ఏమో ! చెప్పలే !
తొలగించండి
రిప్లయితొలగించండిహౌ క్యూట్ టపా యిది గదా !
పెక్యూ లియరు తెలుగోళ్ళు పెద్దచదువుల
న్నైక్యూ లన్గాంచి తమ య
నూక్య మగు తెలుగును మరిచి నోడిరి యిలనౌ !
జిలేబి
నిజమే. కొన్ని పదాలని తెలుగీకరించకుండా ఉండటమే మెరుగు. బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిఈ విషయంలో తవరూ అంగీకరించారు . ధన్యవాదాలు .
తొలగించండిఈ విషయంలో తవరూ అంగీకరించారు . ధన్యవాదాలు .
తొలగించండిఅతి చాదస్తం కటికి దరిద్రం అని సామెత.
రిప్లయితొలగించండినిత్యం వ్యవాహారికంలో ఉన్నమాటల్ని తెలుగు చేసి వికృతి చేయకండి బాబూ అంటే కోపాలొచ్చేస్తున్నాయి. మొన్ననొక చోట సోఫా కి అనువాదం కావాలంటే ఈ పదాలని ఇలాగే వాడుకుంటే బాగుంటుందంటే కోపాలొచ్చేసేయండి. అమ్మని అరటి పండుని మమ్మీ,బనానా అంటే బాగుంటుందా చెప్పండి
అది ఏభాషా పదమైనా వస్తువైనట్లైతే తెలుగులో విరివిగా వాడుతున్నప్పుడు మన పదజాలంలో కలిపేసి వాడుకోవడం
తొలగించండిఎంతో సౌకర్యం . కానీ , తెనిగించి(తెనిగించరు . సంస్కృతీకరిస్తారు)
క్రొత్త పదం సృష్టించామనుకునే దురద మన పండితుల కెక్కుడు లెండి .
ధన్యవాదములు .
సామెత తప్పు చెప్పేనండీ! మన్నించండి. అతి సుకుమారం కటికి దరిద్రం
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅరవం వాడు మొళి ( ఆ ழி అరవానికే సొంతం) అన్నాడు
ఆంగ్లేయుడు మదర్ టంగ్ అన్నాడు)
తెలుగు వాడు సంస్కృత పదమైన భాషను అరువు తెచ్చుకున్నాడు!
భాషను తెలుగులో ఏమందురు ?
భాషకు సరిపడు తెలుగు పదము లేదు
యుత్సవము లేల యన్నరో యున్న తెలుపు
డచ్చ తెనుగున భాషకు ఢంక బేర్చి
జరుప తగు దినోత్సవముల చక్క గాను
జిలేబి
నారదా !
పండితుల నడుగ వలసిన
తొలగించండిదండి వివర మొనసి నాకు తాటించుట యే
లండీ ! తగునేమండీ !
నిండు మనసు బెట్టి చూడు ! నిఝమో ? కాదో ?
అరువు దెచ్చు కొనక నాడిన భాషేది ?
వాడు కైన మాట వేడు కగును ,
' భాష 'తెనుగు జేసి భాదించ పని లేదు
అమ్మఘారు ! తవరి కన్ని దెలుసు .