సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, నవంబర్ 2019, మంగళవారం

అందాల రేలు


సంజె కెంజాయ పుడమిపై చాటు కొఱిగి
చిమ్మ చీకట్లు పరచి రంజిల్లు వేళ
మినుకు మినుకంచు చుక్కలు మినుకు వేళ
రాత్రి యందాల కనుకెంపు రగులు వేళ .....

లీల సుమగంధముల చిరుగాలి వీచి
చేరి ప్రేయసీ ప్రియు దేహ చిరు చెమటల
సోలులు దిగార్చి , కేళుల హాలి గూర్చు
హాయి,  రాత్రులుగాక  ,  ఈ యహములిడున ?

మంచి మనసున్న మారాజు మత్తు గొలుపు
వెన్నెలల సుధలు చినుకు  వేళ యిదియె
జవ్వనుల మనసు పరవశమయి ప్రేమ
విరిసి కౌగిళ్ళు గదియు నవ్వేళ యిదియె

స్వచ్చమైన తెలుపు వర్ణాల పూవులు
విరిసి పరిమళించు వేళ యిదియె
వాటి పరిమళాల వావిరి మత్తులో
తనిసి పుడమి యంత పెనయు టిపుడె

రమణి రాధికా ప్రేమవారాశి మునిగి
మాధవుడు యమునా నదీ మహిత సైక
త మహిని విహరించి యలరు సమయ మిదియె
ప్రేమ మయ మీ రజని , శుభవేళ  చాల .

3 వ్యాఖ్యలు:

 1. రాజారావు మాస్టారు గారు,
  (మీ టపాకు సంబంధం లేని వ్యాఖ్య)👇

  Twitter, Facebook, e-mail ద్వారా గానీ AP CM గారికి వ్రాశారా మీరేమైనా (నేను "జిలేబి" గారి బ్లాగ్ లో ప్రతిపాదించినట్లుగా)?
  లేకపోతే ఇప్పుడు వ్రాయమని మీకు నా మనవి (that is, AP State Formation Day and State name మార్పు గురించి నేను ప్రతిపాదించిన దానితో మీరు ఏకీభవిస్తే). ఎంతమంది వ్రాస్తే అంత ప్రభావం ఉండచ్చని ఆశ. మీకు తెలిసిన వారితో కూడా వ్రాయించే ప్రయత్నం చేస్తే సంతోషం.

  YVR గారి బ్లాగు whyweare2066.com లో letter format పెట్టాను, దాన్ని copy & paste చేసుకోవచ్చు. తేదీ వేసి, క్రింది మీ పేరు వ్రాసి సీఎం గారికి పంపించవచ్చు.

  మీరు CM గారికి వ్రాస్తే గనక Done అని ఒక్కమాట మీ బ్లాగ్ లో కామెంట్ గా పెడితే సంతోషం. Thanks.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పెద్దలు నరసింహారావు గార్కి ,
  నమస్సులు .
  అలాగే నండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. AP CM గారికి మెయిల్ చే‌సేటట్లయితే Please mail to cm@ap.gov.in

  అలాగే మెయిల్ లో పైన సబ్జెక్ట్ లైన్ లో AP Formation Day and State name అని పెడితే అందరి మెయిళ్ళకు uniform గా ఉంటుంది.
  Thanks

  ప్రత్యుత్తరంతొలగించు